గాజువాకకి చెందిన లేడీ కండక్టర్ ఝాన్సీ పేరుకు ఇప్పుడు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు తెగ మార్మోగిపోతోంది. ఉద్యోగరీత్యా కండక్టర్ అయిన ఝాన్సీకి డాన్స్ అంటే ప్రాణమట. ఆ ఇష్టంతోనే శ్రీదేవి డ్రామా కంపెనీలో డాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది. శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో ఝాన్సీ చేసిన డాన్స్ పర్ఫార్మెమెన్స్కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరికొందరు ఆమెకు ఏకంగా అభిమానులైపోయారు. ఆమె ఎక్స్ ప్రెషన్స్, గ్రేస్, డాన్స్ మూమెంట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఝాన్సీ ప్రస్తుతం ఓంకార్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న డాన్స్ ఐకాన్ షోలో సందడి చేసింది. ఆహాలో ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్, రమ్యకృష్ణ జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ లేటెస్ట్ ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా కండక్టర్ ఝాన్సీ మరోసారి పల్సర్ బండి పాటకి డాన్స్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంది. అనంతరం వేదికపై ఝాన్సీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది.
తన తండ్రి వల్ల తాను ఎన్నోసార్లు చనిపోవాలని అనుకున్నాను. అయితే ఆయన వల్ల నేను ఎందుకు చనిపోవాలని.. తనకు తానే ధైర్యం తెచ్చుకొని తన తల్లి, తమ్ముడి కోసం బ్రతికానని ఆమె వెల్లడించింది. పొట్టకూటి కోసం డాన్స్ ని ఎంచుకొని, నేను డాన్స్ చేస్తున్నప్పటికీ ఎంతోమంది విమర్శించారు. అలాగే కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన డాన్స్ వదులుకోలేదని.. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం డాన్స్ అంటూ ఎమోషనల్ అయ్యింది ఝాన్సీ. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.