ప్రస్తుతం గ్రూప్ 2లో టఫ్ ఫైట్ నడుస్తుంది. సౌతాఫ్రికా దాదాపు సెమీస్ అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం ఆ జట్టు ఐదు పాయింట్స్‌తో ఉంది. ఈ రోజు పాకిస్తాన్ మ్యాచ్‌లో గెలిచిన లేదంటే తదుపరి మ్యాచ్‌లో గెలిన సౌతాఫ్రికా సెమీస్ బెర్త్ ఖాయం. అయితే భారత్ సెమీస్‌కి వెళ్లాలి అంటే జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాలి. లేదంటే పాకిస్తాన్‌తో టఫ్ ఫైట్ ఎదుర్కోక తప్పదు. సెమీ-ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకునే లక్ష్యంతో, పాకిస్థాన్ గురువారం (నవంబర్ 3) జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తే దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తుంది, దక్షిణాఫ్రికా చేతిలో పాక్ ఓడిపోతే ఇంటి బాట పట్టాల్సిందే. దీంతో టీమిండియా సులువుగా సెమీస్‌కి వెళుతుంది.
4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన భారత్ తదుపరి రౌండ్‌కు చేరుకునే దిశగా దూసుకుపోతోంది. అయితే సెమీస్ అవకాశాలపై ఇంకా క్లారిటీ రావడం లేదు. పాక్ సౌతాఫ్రికా బ్యాచ్‌తో పూర్తి క్లారిటీ రానుంది. జింబాబ్వేపై భారత్ విజయం సాధిస్తే భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అప్పుడు ఎలాంటి ఫలితాలతో సంబంధం ఉండదు. నవంబర్ 6న ఆ మ్యాచ్ ఉంది కాబట్టి అప్పటి వరకు క్లారిటీ రాదు. అయితే ఈ రోజు పాక్.. సౌతాఫ్రికా మీద ఓడిపోయిన ఇండియా సెమీస్‌కి వెళ్లినట్టే.
ఇక టోర్నీలో పాకిస్థాన్ ఇంకా సజీవంగా ఉండడానికి సౌతాఫ్రికాపై గెలవాలి. వారికి సెమీస్ ఛాన్స్ రావాలి అంటే సౌతాఫ్రికా ఈ రోజు ఓడిపోవాలి. అలానే బంగ్లాదేశ్‌పై కూడా గెలవగాలి. ఇక భారత్.. జింబాబ్వేపై ఓడిపోవాలి. అప్పుడు రన్ రేట్ కీలకం అవుతుంది. ఒకవేళ రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు జింబాబ్వేను ఓడిస్తే పాకిస్థాన్ మ్యాచ్‌ల ఫలితాలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపవు. ఈ రోజు మధ్యాహ్నాం జరిగే మ్యాచ్‌తో కొంత వరకు అయితే క్లారిటీ రానుంది. ఇక గ్రూప్ ఏలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీస్‌కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.