సమంత.. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సమస్య నుంచి కోలుకుంటాననే నమ్మకం ఉందని శనివారం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది సామ్. నిరంతరం యాక్టివ్‌గా కనిపించే సామ్ ఈ విషయాన్ని బయటపెట్టడం, కోలుకోవడానికి ఎక్కువ సమయమే పడుతుందని ఎమోషనల్‌గా పోస్ట్ చేయడంతో సినీతారలు, అభిమానులు సైతం షాక్‌కి గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, నాని, రాశీఖన్నా, జెనీలియా, హన్సిక, నందినీరెడ్డి, వంశీపైడిపల్లి సహా సమంతతో పని చేసిన చాలామంది ఆమె త్వరగా కోలుకోవాలంటూ స్పందించారు. సమంతకు ధైర్యం చెబుతూ పోస్ట్‌లు చేస్తున్నారు.
సమంత మాజీ భర్త నాగచైతన్య సోదరుడు అఖిల్ కూడా సమంత ఆరోగ్యంపై స్పందించాడు. అయితే ఇప్పుడు నాగచైతన్య సమంత ఆరోగ్యంపై స్పందిస్తాడా? లేదా అన్నది హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో నాగ చైతన్య ఫీలింగ్ ఏమిటీ? భయంకర వ్యాధి బారినపడిన సమంత గురించి ఆయన ఏమి ఆలోచిస్తున్నాడనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అసలు నాగ చైతన్య స్పందిస్తాడా? ఆమె గురించి ఏదైనా సోషల్ మీడియా పోస్ట్ చేస్తాడా? అనే సందేహాలు మెదళ్లను తొలిచేస్తున్నాయి. నాగ చైతన్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు.
చాలా అరుదుగా పోస్ట్స్ పెడుతూ ఉంటారు. కాబట్టి సమంతతో ఆయన నేరుగా మాట్లాడే అవకాశం కలదు. లేదంటే ఆమెకు సందేశం పంపవచ్చు. కాబట్టి సమంత ఆరోగ్యం పట్ల చైతూ ఎలా స్పందించారని తెలుసుకోవడం కష్టమే. సమంతతో చైతూ మాట్లాడినా, మెసేజ్ పంపినా ఆ విషయాలు బయటకు రావు కాబట్టి విడాకుల రీజన్ లాగా ఈ విషయం కూడా అలా మరుగున దాగి ఉంటుంది. సమంత కెరీర్ కి ఇది పెద్ద బ్రేక్ అని చెప్పాలి. ప్రస్తుతం సమంత హీరోయిన్ గా చేస్తున్న కొన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి. నవంబర్ 11న యశోద విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం సామ్ ఈ మూవీ డబ్బింగ్ పూర్తి చేస్తుంది.