Tagore And Yogi : వివి వినాయక్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మాస్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న వినాయక్ టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. గత కొంతకాలంగా వినాయక్ చేతిలో ఒక్క మంచి హిట్ సినిమా కూడా లేదు. మెగాస్టార్ కమ్ బ్యాక్ సినిమా పుణ్యమా అని ఖైదీ నెంబర్ 150 తో మంచి హిట్ అందుకున్న వినాయక్ ఆ తరువాత దర్శకత్వాన్ని వదిలేసి కొన్నాళ్లు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు అయితే చేశాడు. సీనయ్య అనే ఒక సినిమా పట్టాలెక్కింది కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా వెలుగులోకి రాలేదు.
అయితే వివి వినాయక్ హీరోగా త్వరలోనే ఒక సినిమా పట్టాలెక్కనుందట. మరోవైపు ఆయన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఛత్రపతి హిందీ రీమేక్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ నిర్మాణ భాగస్వామిగా ఉన్న పెన్ స్టూడియోస్ వివి వినాయక్ కి భారీ ఆఫర్ ప్రకటించిందట. రూ.500 కోట్ల బడ్జెట్ తో మూవీ చేసేందుకు సై అందట. ఛత్రపతి రీమేక్ అవుట్ ఫుట్ పట్ల సంతృప్తికరంగా ఉన్న పెన్ స్టూడియోస్ ఆయనతో భారీ పాన్ ఇండియా మూవీ చేద్దామని డీల్ కుదుర్చుకుందట. కథా చర్చలు కూడా ముగియగా.. ఛత్రపతి ముగియగానే ఈ ప్రాజెక్ట్ పనులు మొదలుకానున్నాయట. రాజమౌళి సినిమాని మంచి వినాయక్ ఈ చిత్రం చేయబోతున్నట్టు తెలుస్తుంది.
![Tagore And Yogi : ఠాగూర్, యోగి.. రెండూ రీమేక్‌లే.. ఒకటి హిట్.. ఒకటి ఫ్లాప్.. ఎందుకలా..? Tagore And Yogi both are remakes why one is hit and the other is flop](http://3.0.182.119/wp-content/uploads/2022/10/tagore-and-yogi-movies.jpg)
రీమేక్ స్పెషలిస్ట్‌గా నిలిచిన వినాయక్ ఓ సినిమాలో మార్పు చేసి బ్లాక్ బస్టర్ కొడితే మరో సినిమాలో ఉన్నది ఉన్నట్టుగా చేసి ఫ్లాప్ అందుకున్నాడు. ప్రభాస్ హీరోగా వివి వినాయక్ దర్శకతంలో యోగి సినిమా రాగా, ఈ సినిమా ప్రభాస్ అభిమానులకి చాలానే నచ్చింది. అయితే కమర్షియల్‌గా చూసుకుంటే మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ అవ్వలేకపోయింది. అయితే ఈ సినిమాను రీమేక్ చేసినప్పుడు ఒరిజినల్ వర్షన్ లో తల్లి చనిపోతుందట. ఆ సీన్ ను అలానే ఉంచడంతో సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఠాగూర్ అనే చిత్రాన్ని కూడా వినాయక్ తెరకెక్కించగా ఒరిజినల్ లో హీరో క్లైమాక్స్ లో చనిపోతాడు. కానీ తెలుగు ఠాగూర్ లో హీరో బ్రతికి ఉంటాడు. హీరో చనిపోకపోవడం వల్లే ఠాగూర్ సూపర్ హిట్ అయిందని అంటున్నారు.