మహేష్ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా ఒక్కడు చిత్రాన్ని చెప్పుకోవచ్చు. గుణశేఖర్ దర్శకత్వంలో 2003 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమాని సుమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎంఎస్. రాజు నిర్మించారు. ఈ చిత్రం అప్పట్లో ఉన్న రికార్డులన్నింటిని చెరిపేసింది. ఏకంగా 130 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ఈ చిత్రం మహేష్‌బాబుకు తిరుగులేని స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అయితే ఈ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్టు ఆఫీసర్ గా పని చేస్తుంటారు.
భూమిక పాస్ పోర్ట్ కోసం ధర్మవరపు సుబ్రహ్మణ్యంను ఆటపట్టించేందుకు మహేష్ అండ్ ఫ్రెండ్స్ ఓ సీన్లో ఓ ఫోన్ నెంబర్ చెప్పి మనోడిని ఆటాడుకుంటారు. కొత్తగా మొబైల్ ఫోన్ కొన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన ప్రియురాలికి నంబర్ చెబుతాడు. మొట్టమొదటిసారి ఈ ఫోన్ కు నువ్వే ఫోన్ చేయాలని కోరుతాడు. ఆ నంబర్ ని మహేష్ గ్యాంగ్ వినడం, పాస్ పోర్టు కోసం టోనీ అనే పేరుతో అతడిని విసిగించడం, చాలా సరదాగా ఉంటుంది.
9848032919 అన్న నెంబర్‌ను పదే పదే చెపుతూ ధర్మవరానికి ఇరిటేట్ తెప్పించడంతో మనోడు వెంటనే పాస్‌పోర్టు ఇచ్చేస్తాడు. అయితే ఇంతకు ఈ పాపులర్ నెంబర్ ఎవరిదో తెలుసా.. సినిమా నిర్మాత ఎంఎస్. రాజుదే అట. ఎవరి నెంబర్ ఉపయోగిద్దాం అని అనుకుంటుండగా, ఎవరిదో ఎందుకు, నిర్మాత నంబర్ వాడేద్దాం అని ఎవరో సలహా ఇచ్చారట. దీనితో అదే నంబర్ ని ఉపయోగించారు. అయితే ఆ తర్వాత ఈ నెంబర్‌కు లక్షలాది ఫోన్‌కాల్స్ వచ్చాయట. ఏదో సరదాగా రాజు నెంబర్ ఇస్తే ఆ సినిమా హిట్ అయ్యాక వచ్చిన ఫోన్ కాల్స్‌ను తట్టుకోలేక రాజు ఆ నెంబర్‌ను తీసేశారట. ఇది ఆ నెంబర్ వెనుక ఉన్న అసలు కహానీ.