World Cup Ganesha : వినాయక చవితి వేడుకని ప్రతి ఒక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. రేపు వినాయక చవితి పండగ కావడంతో ఇప్పటికే అంతటా ప్రత్యేకమందిరాలు కొలువుదీరుతున్నాయి. అయితే మనం ప్రతి సంవత్సరం కూడా వెరైటీ విగ్రహాలని చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఈ సారి టీ20వరల్డ్ చేతిలో పట్టుకొని ఉన్న గణపయ్య ప్రత్యక్ష్యం అయింది. వినాయకుడు రోహిత్ శర్మకి కప్ అందిస్తున్నట్టు గా విగ్రహం ఉంది. ఇక వినాయకుడిని తీసుకెళ్లే వాహనాన్ని కూడా టీమిండియా ఆటగాళ్ల పోస్టర్స్‌తో రూపొందించారు. ఛాంపియన్ 2024 అని పెద్ద ఫ్లెక్సీ పెట్టగా దానిని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇక సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమ్ఇండియా టీ 20 ప్రపంచ కప్ గెలుచుకుంది. ఓటమి తప్పదని భావించిన క్షణంలో రోహిత్ సేన అద్భుతం చేసింది.ఓటమి అంచులకు చేరుకున్నామనుకున్న క్షణంలోనే రోహిత్ నేతృత్వం లోని జట్టు సభ్యుల సమిష్టి కృషితో ట్రోఫీని దక్కించుకుంది.భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. నేలపై పడి ఆనందాన్ని ప్రదర్శించాడు. కన్నీరుమున్నీరయ్యాడు.తమ జట్టుకు అద్భుత ట్రోఫీని అందించిన బార్బడోస్ పిచ్ మట్టిని తిన్నాడు. ఆ నేలకు గౌరవాన్నిచ్చాడు. గుండె నిండా ఆనందోత్సాహంతో, భుజాలపై కుమార్తెను ఎత్తుకొని గ్రౌండ్ లో తృప్తిగా తిరిగాడు.అదే ఆనందంతో పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో తన టీ 20 ఫార్మాట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆటకు వీడ్కోలు పలకటానికి ఇంతకన్నా మంచి సమయం లేదన్నాడు.
అనితర సాధ్యం రోహిత్ ప్రయాణం. జట్టు సారాధిగా 5 ఐపిఎల్ ట్రోఫీలు, ఛాంపియన్స్ లీగ్ టీ 20 ట్రోఫీ, నిదహాస్ ట్రోఫీ ,టీ 20 ప్రపంచ కప్ అందించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రయాణం నిజంగా ఘనంగా సాగుతూ వస్తుంది. వచ్చే వరల్డ్ కప్ రోహిత్ శర్మ ఆడాలని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. కాని అప్పటి వరకు రోహిత్ ఆడే ఛాన్స్ లేదని కొందరి మాట.