Manchu Manoj : ఆర్ఆర్ఆర్ సినిమాతో నేషనల్ వైడ్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ చరణ్ నిన్న తన బర్త్ డే వేడుకలని గ్రాండ్‌గా జరుపుకున్నారు. మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చరణ్ బర్త్ డే వేడుకల కోసం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి బుల్లితెర సెలెబ్రిటీలు, బిగ్ బాస్ సెలెబ్రిటీలు. టాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరయ్యారు. మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ గురించి మంచు మనోజ్ మాట్లాడిన మాటలు, ఇచ్చిన ఎలివేషన్స, మంచు మెగా ఫ్యామిలీ మధ్య ఉండే వైరం గురించి చెప్పిన మాటలు, చివర్లో వేసిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ నాకు ప్రాణ మిత్రుడు.. అలాంటి రామ్ చరణ్ బర్త్ డే ఈవెంట్‌కు ఇలా రావడం ఆనందంగా ఉంది. ప్రతీ ఏడాది అభిమానులు ఎంతో గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ చేస్తారు.
రామ్ చరణ్ చిన్నతనం నుంచీ తనతో ఉన్న స్నేహితులతో ఇప్పటికీ అలానే ఉన్నారు.. ఈ కాలంలో స్నేహం దొరకడం చాలా కష్టం.. అందరూ స్థాయి పెరిగాక కొత్త స్నేహాలతో బిజీగా ఉంటారు.. పాత వారిని మరిచిపోతారు.. కానీ రామ్ చరణ్ మాత్రం ఇంకా తన చిన్న నాటి స్నేహితులతోనూ అలానే ఉంటాడు.. మేం చెన్నైలో అంతా కూడా పక్కపక్కనే ఉండేవాళ్లం. చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎవ్వరినీ రాంచరణ్ మరచిపోలేదు. అందరిని గుర్తుపెట్టుకున్నాడు. ఇక రాంచరణ్ ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే ఆదుకుంటాడు. ఆ గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది అని మంచు మనోజ్ తెలిపాడు. దుబాయ్ లో ఒక తెలుగు ఆడపిల్లకి కష్టం వచ్చింది. ఇమిగ్రేషన్ సమస్య వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని లాక్ చేసేశారు.
మిత్రమా దుబాయ్ లో ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉంది.. వెంటనే 5 లక్షలు కావాలి అని అడిగా. అకౌంట్ నంబర్ పంపు బాబాయ్ అని చెప్పాడు. అకౌంట్ నెంబర్ పంపగానే క్షణాల వ్యవధిలో 5 లక్షల సాయం చేశాడు అని మంచు మనోజ్ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న విభేదాల గురించి వేదికపై మనోజ్ ఓపెన్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఈ ఈవెంట్ కి వస్తూ ఉంటే కొందరు మిత్రులు అడిగారు. మీ నాన్న మోహన్ బాబు గారు.. వాళ్ళ నాన్న చిరంజీవి గారు ఎప్పుడూ గొడవపడుతుంటారు.. మళ్ళీ కలసి పోతుంటారు. కానీ నువ్వు మాత్రం చరణ్ తో స్నేహంగా ఉంటున్నావేంటి అని అడిగారు. నేను ఒక్కటే సమాధానం ఇచ్చా. భార్య భర్తలు గొడవపడుతుంటారు కలసిపోతుంటారు.. దాని గురించి బయటి వాళ్ళు మాట్లాడకూడదు. చిరంజీవి గారు.. మోహన్ బాబు గారు క్యూట్ టామ్ అండ్ జెర్రీ అని అభివర్ణించారు. మెగా ఫ్యామిలీ, మంచు మధ్య రిలేషన్ ఫిష్ అండ్ వాటర్ లాగా ఉండాలి.. ఫిష్ అండ్ ఫిషర్ మాన్ లాగా కాదు అంటూ డైలాగ్ చెప్పి అలరించాడు.