నందమూరి కల్యాణ్ రామ్ చాలా రోజుల తరువాత బింబిసార మూవీతో హిట్ కొట్టాడు. కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో వచ్చిన బింబిసార మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కల్యాణ్ రామ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును చాటుకున్నా.. ఆయన నటనలో మాత్రం ఇతర హీరోలకు చాలా భిన్నమనే చెప్పవచ్చు. నిర్మాతగా కూడా కొత్త హీరోలు, దర్శకులను ఆయన ప్రోత్సహిస్తుంటారు. ఇక తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌పైనే బింబిసారను నిర్మించారు. ఈ క్రమంలోనే మూవీ రికార్డులను కొల్లగొడుతోంది.
కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్‌లో నిర్మించిన బింబిసారను పూర్తి చేసేందుకు 3 ఏళ్లు పట్టింది. 2019 నుంచి ఈ సినిమాపై పని చేస్తున్నారు. ఈ సారి తన కెరీర్‌లోనే బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన పటాస్ సినిమా కలెక్షన్ల కంటే రెండు రెట్లు ఎక్కువగానే బడ్జెట్‌ను ఖర్చు చేసి సినిమా తీశారు. దాదాపుగా రూ.40 కోట్ల బడ్జెట్‌తో బింబిసారను తెరకెక్కించారు. ఈ మూవీ ఆగస్టు5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.
కాగా ఈ మూవీకి మొదటి రోజే రూ.6.30 కోట్ల షేర్ రాగా, రూ.9.30 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఆదివారం కావడంతో కలెక్షన్ల జోరు మరింత పెరిగింది. 3వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.29.80 కోట్ల గ్రాస్, రూ.18.10 కోట్ల షేర్ ను సాధించింది. అయితే కల్యాణ్ రామ్ బింబిసార కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషంగా చెబుతున్నారు. మూడో రోజు నైజాంలో రూ. 5.66 కోట్లు, వైజాగ్‌లో రూ.2.26 కోట్లు, సీడెడ్ రూ.3.38కోట్లు, నెల్లూరు రూ.50 లక్షలు, గుంటూరు రూ.1.27 కోట్లు, కృష్ణా జిల్లా రూ.88 లక్షలు, తూర్పు గోదావరి రూ.1.02 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.73క్షలు, యూఎస్‌ఏ రూ.1 కోటి, మిగిలిన ప్రాంతాలలో రూ.32 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ మూవీతో కల్యాణ్ రామ్ దశ తిరిగిందనే అంటున్నారు.