హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా 8210 4జి పేరిట ఓ నూతన 4జీ వీవోఎల్‌టీఈ ఫీచర్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ డిజైన్ మాత్రమే కాకుండా.. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. దీని వల్ల ఫోన్ మన్నిక ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. ఇక ఈ ఫోన్‌లో 2.8 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది అద్భుతమైన క్వాలిటీని కలిగి ఉంటుంది.
ఈ ఫోన్‌లో యూజర్ ఇంటర్‌ఫేస్‌ను సింపుల్‌గా ఏర్పాటు చేశారు. దీనికి టార్చ్ సదుపాయం ఉంది. రేడియోను వైర్‌లెస్ రూపంలో వినవచ్చు. అలాగే ఎంపీ3 ప్లేయర్ కూడా ఉంది. దీంట్లో గేమ్‌లాఫ్ట్‌కు చెందిన గేమ్స్‌తోపాటు ఆరిజిన్ డేటా గేమ్స్‌ను కూడా ప్రీ లోడెడ్‌గా అందిస్తున్నారు.
నోకియా 8210 4జి ఫీచర్ ఫోన్‌లో 1 గిగాహెడ్జ్ యూనిసోక్ టి107 సింగిల్ కోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే 48 ఎంబీ ర్యామ్, 128 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తాయి. మెమొరీని కార్డు ద్వారా 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్ లను వేసుకోవచ్చు. ఎస్30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తోంది. అలాగే వెనుక వైపు వీజీఏ కెమెరా ఉంది. 3.5 ఎంఎం జాక్ ద్వారా మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు. 4జీ వీవోఎల్‌టీఈ ఫీచర్ లభిస్తుంది. బ్లూటూత్ 5.0 సదుపాయం కూడా ఉంది. ఈ ఫోన్‌లో 1450 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇది అద్భుతమైన బ్యాకప్‌ను అందిస్తుంది.
ఇక నోకియా 8210 4జి ఫీచర్ ఫోనే్ డార్క్ బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. ఈ ఫోన్ ధర రూ.3,999గా ఉంది. అమెజాన్‌తోపాటు నోకియా ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నారు.