మొబైల్స్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్.. స్మార్ట్ 6 ప్లస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ కంపెనీకి చెందిన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇక ఇందులో 6.82 ఇంచుల హెచ్‌డీ ప్లస్ స్క్రీన్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు ముందు వైపు నాచ్‌లో 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీంట్లో హీలియో జి25 ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. 3జీబీ ర్యామ్‌కు తోడుగా మరో 3జీబీ వర్చువల్ ర్యామ్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ సాఫ్ట్‌వేర్‌ను ఇందులో అందిస్తున్నారు.
ఈ ఫోన్‌లో వెనుక వైపు 8 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు మరో సెకండరీ సెన్సార్‌ను పోర్ట్రెయిట్ షాట్స్ తీసుకునేందుకు ఏర్పాటు చేశారు. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక వైపు ఇచ్చారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌లో అందిస్తున్న డిస్‌ప్లేకు పాండా ఎంఎన్228 గ్లాస్ ప్రొటెక్షన్ లభిస్తుంది. 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి25 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు.
ఈ ఫోన్లో డీటీఎస్ సరౌండ్ సౌండ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. అలాగే 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఇతర ఫీచర్లను అందిస్తున్నారు. దీనికి 10 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా లభిస్తుంది. కాగా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్‌ను మిరాకిల్ బ్లాక్, ట్రాంక్విల్ సీ బ్లూ కలర్ ఆప్షన్‌లలో విడుదల చేశారు. ఈ ఫోన్ ధర రూ.7,999 ఉండగా.. ఆగస్టు 3 నుంచి ఫ్లిప్ కార్ట్‌లో విక్రయిస్తారు.