CM KCR : తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ దూకుడు పెంచారు. పలు నియోజకవర్గాలని చుట్టేస్తున్న కేసీఆర్ ఇటీవల కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ఇంతకు ముందు పెట్టిన ఎలుగులు ఏంటి ? హర్షవర్ధన్‌రెడ్డి ఖరాబ్ చేసిందేంది? అందుకు నేను అనేది అనేది ఓట్లు అట్టిగనే వేయొద్దు. గ్రామాల్లో చర్చించండి. ఈ తొమ్మిదేళ్లలో ఎన్ని కష్టాలుపడ్డమో మీరు చేశారు. నీళ్లు తేవడానికి ఎన్ని బాధలుపడ్డాం. కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా కావొచ్చు. కాంగ్రెస్ రాజ్యంలో వాటికి పెండింగ్ ప్రాజెక్టులని పేరు పెట్టారు’ అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
50 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కాలం అంతా తెలంగాణకు వెనుబడిన ప్రాంతమని.. గరీబు ప్రాంతమంటూ కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టింది. ఇక్కడ వడ్లు పండయని.. కేవలం జొన్నలు మాత్రమే పండించుకోవాలని చెప్పారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.10 ఏళ్ల క్రితం కూడా తెలంగాణకు నీళ్లు రావని కాంగ్రెస్ నేతలు మాట్లాడారని.. కానీ ఈరోజు తెలంగాణలో 3 కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయని కేసీఆర్ వివరించారు. కొల్లాపూర్‌లో 1.25 లక్షల ఎకరాల్లో వడ్లు పండుతన్నాయని పేర్కొన్నారు.
ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నవారి గుణగణాలు, వారు ఎలాంటి వారు, ఎంత పని చేస్తారు అనేది చూసుకుని ఓటు వేయాలి. ఎవరో చెప్పారు, ఏదో చేస్తారు అని ఓటు వేస్తే తర్వాత మీరే ఇబ్బంది పడతారు అని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చర్చించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మరోసారి గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బర్రెలక్కని ఉద్దేశించే కేసీఆర్ అలాంటి కామెంట్స్ చేశాడని పలువురు చర్చించుకుంటున్నారు.