Pawan Kalyan In Warangal : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలు ఎత్తులకుపై ఎత్తులు వేస్తూ వ్యూహాలను రచిస్తున్నాయి. దాంతో పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. అయితే ఒకపార్టీ నేతలు మరో పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ దుమ్మెత్తి పోసుకొంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్నారు. బీజేపీకి మద్దతుగా ఆయన పలు సభలలో పాల్గొంటున్నారు. వరంగల్ నుండి తన ప్రచారం మొదలు పెట్టగా, అక్కడ ఆయన క్రేజ్ చూసి అందరు షాకయ్యారు. రోడ్లన్ని కూడా జనాలతో నిండిపోయాయి. ఈ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుందని ఎవరు ఊహించలేదు. అభిమానులు పవన్ ని తమ కెమెరాలో బంధించేందుకు పోటీ పడ్డారు. అందరికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు పవన్.
వరంగల్ సభలో మాట్లాడిన పవన్ ఆంధ్రాలో రౌడీలు రాజ్యామేలుతున్నారని, గూండాల పాలన నడుస్తోందని, అలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడుతున్నానంటే వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను కూడా ఉన్నానన్నారు. తెలంగాణలో జనసేన ఉంటుందని.. తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించామని తెలిపారు. 2009లో స్థాపించిన పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కారణమని చెప్పుకొచ్చారు.
నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో తాను ఒకడిని అని అన్నారు . సమస్యలొస్తే తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామని.. బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలని అందుకే బీజేపీతో కలిసినట్లు తెలిపారు. ఉమ్మడి అభ్యర్థుల తరుపున పవన్‌కల్యాణ్ ప్రచారం చేస్తుండగా, వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్‌తో కూడా బిజీగా ఉన్నారు.