Manchu Vishnu : తెలుగు సినిమా పరిశ్రమలో కొన్నాళ్ల ముందు వరకు మెగా మరియు మంచు ఫ్యామిలీ లు అంటే ఒకరికి ఒకరు పడకపోయేది. మెగా ఫ్యామిలీ పై కోపంతో రామ్ గోపాల్ వర్మతో మోహన్ బాబు సన్నిహిత్యంగా ఉన్నాడు అంటూ ప్రచారం జరిగేది. సినిమా పరిశ్రమ లెజెండ్స్ అంటూ వీరిద్దరి మద్య అభిమానులు పెద్ద గొడవే రాజేయడం ఇద్దరు కూడా ఒకానొక సమయంలో చాలా గొడవలు పడటం జరిగింది.కాని ఇండస్ట్రీలో ఎప్పుడు కలుసుకోవడాలు మాట్లాడుకోవడాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ ఫ్యామిలీల గురించి అనేక ప్రచారాలు సాగుతున్నా కూడా ఈ రెండు ఫ్యామిలీలకి సంబంధించి ఒకరికి ఒకరు హగ్ లు ఇచ్చుకోవడం ఒకరిని ఒకరు సమర్థించుకోవడం వంటివి చేస్తూనే ఉంటారు.
చిరంజీవిని వాడు వీడు అంటూ సంభోదించిన మోహన్ బాబు కొన్నాళ్లుగా మర్యాదతో పాటు ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. ఇద్దరం మంచి మిత్రులం అంటూ మోహన్ బాబు మరియు చిరంజీవిలు పదే పదే అంటూ ఉండగా, అందరిలో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆచార్య సినిమా షూటింగ్ సందర్బంగా కూడా చిరు, మోహన్ బాబు కలిశారు.ప్రత్యేకంగా చిరంజీవిని ఎందుకు మోహన్ బాబు కలిశాడు అనేది అందరికి పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఏది ఏమైన మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.
విశ్వక్ సేన్ హీరోగా సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా ల కొద్ది రోజుల క్రితం లాంచనంగా ప్రారంభమైంది.. రోడ్ జర్నీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందాల్సిన ఈ సినిమాకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( ముఖ్య అతిథిగా హాజరయ్యారు..అర్జున్ కోరిక మేరకు ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరైనట్లు సమాచారం. ఈ సినిమా ఓపెనింగ్ కు పవన్ కళ్యాణ్‌తో పాటు విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ హాజరయ్యారు. ఈ వేడుకలో పవన్‌కళ్యాణ్,ప్రకాష్‌రాజ్ ఏదో ఓ విషయం గురించి సీరియస్‌గా ముచ్చటించుకుంటున్న ఫొటోలు నెట్టింట షికారు చేస్తున్నాయి. మంచు విష్ణు కూడా ఈవెంట్‌లో సందడి చేయగా, అందరితో ఆప్యాయంగా పలకరించిన పవన్.. విష్ణుతో మాత్రం దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇంకా వారి మధ్య గొడవలు అలానే ఉన్నాయని అంటున్నారు.
https://youtube.com/watch?v=Nh-FLSscbPg