Rashmika Mandanna : గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోన్న టాపిక్ ఏదైన ఉంది అంటే అది ప్రముఖ నటి రష్మిక మందన్న గురించే. ఆమె ఫేక్ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వీడియోలో ఆమె డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని లిఫ్ట్ లోకి వచ్చినట్లు మార్ఫింగ్ వీడియోను క్రియేట్ చేశారు. తాజాగా, ఈ వీడియోపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు అత్యంత ప్రమాదకరమైన చర్యగా అభివర్ణించిన కేంద్రం.. మార్ఫింగ్ వీడియోలను కట్టడి చేయాల్సిన బాధ్యత సామాజిక మాధ్యమాలదేనని స్పష్టం చేసింది. డీప్‌ఫేక్‌లను వీడియోలను సృష్టించి, సర్క్యులేషన్ చేస్తే చట్టపరంగా చర్యలు, జరిమానాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 66D ప్రకారం కంప్యూటర్ వనరులను ఉపయోగించి వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఎవరు చేసిన కూడా వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధించబడుతుంది’ అని పేర్కొంది. అలాగే, గత ఏప్రిల్‌లో జారీ చేసిన ఐటీ నిబంధల ప్రకారం.. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు చట్ట పరమైన బాధ్యతలను పాటించాల్సి ఉంటుందని కేంద్ర ఐటీ ప్రసార శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఏ వినియోగదారు కూడా తమ అకౌంట్ నుంచి నకిలీ లేదంటే తప్పుడు సమాచారాన్ని పోస్టు చేయకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.
అయితే ఈ ఘటనపై పలువురు సెలబ్రిటీలు సహా ప్రముఖులు రష్మికకు మద్దతుగా నిలిచారు. వీరందరికి హీరోయిన్ రష్మిక కృతజ్ఞతలు తెలిపారు. కాగా వీడియాలో బ్రిటిష్ ఇండియన్ ఇన్‌ఫ్లుయన్సర్ జరా పటేల్ ఉంది. అయితే. కొందరు డీప్ పేక్ టెక్నాలజీ ఆధారంగా మందన్న వీడియోను రూపొందించారు. అయితే ఈ వీడియో భాగా వైరల్ అయింది. దీనిపై అనేక మంది ప్రముఖులు నటి రష్మిక మందన్నకు మద్దతుగా నిలిచారు. భవిష్యత్‌లో ఎదురయ్యే ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు చట్టపరమైన చర్యలు ఉండాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి, సోషల్ మీడియో సంస్థలు రిమైండర్‌ను జారీచేసింది.