India Vs Pakistan : ప్రపంచకప్ 2023 నాకౌట్ దశకు చేరుకుంటుంది. ఇప్పటికే మూడు జట్లు సెమీస్ చేరుకోగా, నాలుగో స్థానం కోసం ఎవరు పోటీ పడతారా అనేది ఆసక్తికరంగా మారింది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తొలి మూడు స్థానాలలో ఉండగా, నాలుగో స్థానంలో ఏ జట్టు చేరుతుందా అని ప్రతి ఒక్కరు ఆలోచనలు చేస్తున్నారు. అయితే సెమీస్‌లో భారత్ వర్సెస్ పాక్ తలపడే అవకాశాలున్నాయా, అలా తలపడితే బాగుంటుందని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడు. క్రికెట్ ప్రేమికులకు ఇంతకు మించిన హై వోల్టేజ్ మ్యాచ్ మరొకటి ఉండనే ఉండదు. ఈ సారి ఏ మాత్రం అంచనాల్లేని ఆఫ్గనిస్తాన్ సెమీస్ రేసులోకి వచ్చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ సెమీస్ రేసులోకి కూడా రాలేకపోయింది. శ్రీలంక కూడా కుదేలైపోయింది.
ఆఫ్ఘనిస్తాన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సెమీస్ రేసులోకి వచ్చేస్తోంది. ఆస్ట్రేలియాపై గెలిచి ఉంటే మాత్రం ఆఫ్ఘన్‌కి సెమీస్ ఛాన్స్ ఎక్కువ ఉండేవి. కాని ఇప్పుడు కాస్త క్లిష్టంగా మారాయి. ఇప్పుడు నాలుగో స్థానంపై న్యూజిలాండ్, పాక్ దృష్టి పెట్టాయి. పాకిస్తాన్ సెమీస్ కు అర్హత సాధించాలంటే ఇంగ్లండ్ తో జరిగే పోరులో తప్పకుండా గెలవాల్సి ఉంది. అది కూడా భారీ తేడాతో. అదే సమయంలో న్యూజిలాండ్ తమ ఆఖరి మ్యాచ్ లో శ్రీలంక చేతిలో ఓడాల్సి ఉంటుంది. ఒకవేళ గెలిచినా.. పాకిస్తాన్ కు ఛాన్స్ ఉంటుంది. శ్రీలంకపై కివీస్ గెలిస్తే.. అప్పుడు ఇంగ్లండ్ పై పాకిస్తాన్ భారీ తేడాతో నెగ్గాలి. అప్పుడు నెట్ రన్ రేట్ కివీస్ కంటే పాకిస్తాన్ కు మెరుగ్గా ఉంటుంది.
అదే సమయంలో అఫ్గానిస్తాన్ అన్ని మాచ్ లను ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు టేబుల్లో భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లు వరుసగా టాప్ 4లో నిలుస్తాయి. అప్పుడు సెమీస్ లో టేబుల్ టాపర్ అయిన భారత్ తో నాలుగో స్థానంలో నిలిచిన పాకిస్తాన్ తలపడుతుంది. ఇక మరో సెమీ ఫైనల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఆడతాయి. ఈ రకంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మరోసారి మ్యాచ్ ను చూసే అవకాశం అభిమానులకు కలుగుతుంది. ఇప్పటికే భారత్, పాక్ మధ్య లీగ్ మ్యాచ్ జరగగా ఈ మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సాధించింది.