Pawan Kalyan Wife Anna Lezhneva : జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు. ఆయన ఈ సారి అధికారం చేజిక్కించుకోవాలని కష్టపడుతున్నారు. పవన్ రాజకీయాలలోకి వచ్చిన వెంటనే ఆయన గురించి తప్పుడు ప్రచారాలు చేయడం మొదలు పెట్టారు. ఒకవైపు పవన్ పెళ్లిళ్ల గురించి విమర్శలు చేస్తూనే ఉండగా, రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినోవాతో విడిపోయారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే వాళ్లిద్దరూ సోషల్‌గా దూరంగా ఉంటున్నారని, త్వరలోనే లీగల్‌గా విడిపోనున్నారనేది ఆ వార్తల సారాంశం. ఈ న్యూస్‌తో పవన్ ఇమేజ్‌కు డ్యామేజ్ కలిగే పరిణామాలు తలెత్తాయి. దీంతో విడాకుల వార్తను ఖండిస్తూ జనసేన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ పోస్ట్ పెట్టింది. దాంతో పుకార్లకి చెక్ పడ్డాయి.
ఒక్క ట్వీట్‌తో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టినట్లయింది. అయితే ఏపీ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా మారుతున్న పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను జనాల్లో పలుచన చేసేందుకే అధికార పార్టీ నేతలు ఇలాంటి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పవన్ , అన్నా లెజినోవాలు తాజాగా ఎయిర్ పోర్ట్‌లో మెరిసారు. నవంబర్ 1న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో ఉండగా, ఆ వివాహ వేడుకలో పాల్గొనేందుకు కళ్యాణ్ అన్నా లెజినోవాతో కలసి సతీసమేతంగా ఇటలీ బయలుదేరారు.
అన్నా లెజినోవా మీడియాకి కనిపించడం, పబ్లిక్ లో తిరగడం చాలా తక్కువ. దీనితో పవన్, లెజినోవా కనిపించడంతో కెమెరా కంటికి చిక్కారు. ఈ దృశ్యాలని పవన్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే అన్నా, పవన్ లు మెగా ఫ్యామిలీతో సన్నిహితంగా ఉన్న పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. పవన్ తన ఫ్యామిలీలో ఫంక్షన్స్ లో అడపాదడపా మెరుస్తున్నా కూడా అన్నా మాత్రం ఎప్పుడో ఒకసారి మాత్రమే మెరుస్తుంది.