Varun Tej And Lavanya Tripathi : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ల పెళ్లి నవంబర్ 1 జరగనుండగా, నవంబర్ 5న రిసెప్షన్ వేడుక జరగనుంది. అయితే ఈ జంట ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనుంది. ఇక వీరు పెళ్లి చేసుకోవడానికి ఇటలీలోని టుస్కానీని ఎంపిక చేసుకోగా, టుస్కానీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఎంతో ప్రసిద్ధిగాంచింది. నవంబర్ 1వ తేదీన వీరు పెళ్లి చేసుకోనున్న నేపథ్యంలో హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈరోజు ఇటలీకి బయలుదేరారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లతోపాటు పంజా వైష్ణవ్ తేజ్, నిహారిక కొణిదల, కొందరు కుటుంబ సభ్యులు కూడా ఇటలీ వెళ్లడం విశేషం. కొణిదెల, త్రిపాఠి, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇటలీ వెళతారు. ఇక వీరిద్దరి పెళ్ళికి వరుణ్ తేజ్ సన్నిహితులలో ఒకరైన యువ హీరో నితిన్, నిహారిక మరియు లావణ్య త్రిపాఠికి సన్నిహితురాలైన రీతూ వర్మ కూడా హాజరు కానున్నారు. పవన్ కళ్యాణ్ కూడా కొద్ది రోజుల పాటు పాలిటిక్స్, సినిమాలకి బ్రేక్ ఇచ్చి ఇటలీ వెళ్లనున్నారు. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీ ల పెళ్లికి ముందు 30వ తేదీన మెహందీ, హల్దీ వేడుకలు జరగనున్నాయి. పెళ్లి తర్వాత మళ్లీ వీళ్ళు హైదరాబాద్ కి తిరిగి వచ్చిన తర్వాత నవంబర్ ఐదవ తేదీన మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో రిసెప్షన్ అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు.
మొత్తానికి కొణిదెల వారి పెళ్లి సందడి మొదలు కావడంతో మెగా ఫ్యామిలీలో అందరూ రెట్టించిన ఉత్సాహంతో ఇటలీకి బయలుదేరుతున్నారు. ఇదిలా ఉంటే జూన్ 9 నెల లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. స్టార్ డిజైనర్ మనీశ్ డిజైన్ చేసిన డ్రెస్‍లను పెళ్లి రోజున వరుణ్, లావణ్య ధరించనున్నారట. “ప్రత్యేకమైన రోజు మరింత స్పెషల్‍గా ఉండేలా మనీశ్ మల్హోత్రా క్రియేట్ చేసిన వెడ్డింగ్ ఔట్‍ఫిట్‍లను ఆ జంట ఎంపిక చేసుకున్నారు. వారి ఇద్దరి అభిరుచులు, ప్రత్యేకమైన వ్యక్తిత్వాలు ఉట్టిపడేలా ఈ కస్టమ్ డిజైన్డ్ వెడ్డింగ్ డ్రెస్‍లు ఉండనున్నాయి.