Brahmanandam : హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి తెలియని వారు ఉండరు. ఆయన తన కామెడీతో ఎంతగా నవ్విస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ శతజయంతి కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబసభ్యులతో పాటు అల్లు అరవింద్, బ్రహ్మానందం, మురళీమోహన్, జయసుధ, మోహన్‌బాబు, శ్రీకాంత్, జగపతిబాబు, రామ్ చరణ్, రాజేంద్రప్రసాద్, మహేశ్ బాబు, రానా, విష్ణు, నాని, దిల్ రాజు, రాజమౌళి, కీరవాణి, సుబ్బిరామిరెడ్డి, డీజీపీ అంజనీకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఏఎన్నార్ విగ్రహావిష్కరణ చూడటమే మహాభాగ్యమని అన్నారు.
విగ్రహావిష్కరణ వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జరగగా, విగ్రహావిష్కరణ జరిగే సమయంలో నాగార్జున చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక బ్రహ్మానందం కూడా నాగార్జున గురించి ఎమోషనల్‌గా మాట్లాడుతూ.. కన్నీరు పెట్టుకున్నారు. రైతుకుటుంబంలో పుట్టి అద్భుతమైన స్థితికి ఏఎన్నార్ చేరుకున్నారని బ్రహ్మానందం అన్నారు. అద్భుతమైన స్థితికి చేరుకోవడం సామాన్యమైన విషయం కాదన్నారు. నటన అనే చిన్న అర్హతతో ఏఎన్నార్ మహోన్నత వ్యక్తిగా మారారని కొనియాడారు. అక్కినేని నాగేశ్వరరావు సర్వసాధారణంగా ఉంటారని, ఆయన క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటుందన్నారు. ఏఎన్నార్‌కు వచ్చినన్ని అవార్డులు ఇంకెవరికీ రాలేదని.. ఆయన పొందిన సన్మానాలు ఇంకెవరికీ జరగలేదని తెలిపారు.
ఆ రోజులలో నాగేశ్వరరావు ఎలా మాట్లాడేవారు, ఎలా నడిచేవారు, ఎలాంటి బట్టలు వేసుకునేవారు, ఇలాంటివి అన్ని చూసి మేము పిచ్చి పిచ్చిగా ఇమిటేట్ చేసే వాళ్లం. ఆయనకు కారం అంటే చాలా ఇష్టం. కడుపు తీపి ఎక్కడదమ్మా అంటూ బ్రహ్మానందం అలరించారు. కొన్ని సందర్భాలలో అక్కినేని గురించి బ్రహ్మానందం మాట్లాడుతూ కొంత ఎమోషనల్ కూడా అయ్యారు.