Nara Brahmani : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ తర్వాత రిమాండ్‌పై తూర్పుగోదారి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి రాజమహేంద్రవరంలోని విద్యానగరంలో బస చేశారు. ఈ క్రమంలో ఆ శిబిరానికి నాలుగున్నరేళ్ల బాలుడు అనిత్ తన తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. అక్కడ నారా బ్రాహ్మణిని కలిశాడు. అనిత్ వచ్చీరాని మాటలతో బ్రాహ్మణిని అబ్బురపరిచి అందరిని ఆశ్చర్యపరిచాడు. నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ద్వారా ప్రజల కోసం పోరాటం చేశాడని ఆ బాలుడు బ్రాహ్మణి తో చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
2024లో చంద్రబాబు సీఎం అయ్యే వరకు తాను పోరాడతానని.. యువగళం యాత్రలో లోకేష్.. తన కాళ్లకు బొబ్పలు వచ్చినా పట్టించుకోకుండా తన కుటుంబానికి దూరంగా ఉండి ముందుకు సాగారన్నాడు బాలుడు. ఆయనకు తన హృదయపూర్వక అభినందనలని చెప్పాడు. బాలుడు మాటలకు బ్రాహ్మణి సో నైస్.. థ్యాంక్యూ అంటూ అభినందించారు. అంతేకాదు బాలుడి తల్లిదండ్రులు చంద్రన్న పెళ్లి కానుక పథకం ద్వారా లబ్ధి పొందారని ట్వీట్‌లో వివరించారు. గూడూరుకు చెందిన డాక్టర్ చిరంజీవి కుమారుడు అనిత్. అనిత్,కు తల్లిదండ్రులకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు, బాలకృష్ణ అంటే అభిమానం.
అనిత్ పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోను గుక్కతిప్పుకోకుండా అనర్గళంగా చెప్పుకకు రావడంతో బుడతడి మాటలకి అందరు ఫిదా అవుతున్నారు. చంద్రబాబును చూస్తానని పట్టుబట్టడంతో బాలుడ్ని రాజమహేంద్రవరం తీసుకొచ్చారు. అనిత్ మాటలకు బ్రాహ్మణి ఫిదా అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను భావి తరాల కోసం చంద్రబాబుతో నేను (అయామ్ విత్ సీబీఎన్) అని నారా బ్రాహ్మణి శుక్రవారం ట్వీట్ చేశారు. అంతేకాదు అనిత్ గతంలో చంద్రబాబుతో దిగిన ఫోటో కూడా వైరల్ అవుతోంది. చంద్రన్న పెళ్లి కానుక ద్వారా ఆ చిన్నారి తల్లిదండ్రులు వివాహం చేసుకుని ఒకటయ్యారు అని పేర్కొన్న నారా బ్రాహ్మణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు తరాలను రక్షించడానికి తాను కూడా చంద్రబాబు నాయుడుతో ఉన్నానంటూ ట్వీట్ చేశారు.