Balakrishna Daughters : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయనని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి జైలుకు వెళ్లి కలిసి పరామర్శించారు. వారికి 45 నిమిషాలు మాట్లాడేందుకు అధికారులు సమయం కేటాయించారు. కేవలం ముగ్గురికి మాత్రమే చంద్రబాబును కలిసి మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. దాంతో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్ కు నిరాశే ఎదురైంది. వారు సైతం చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి జైలుకు వెళ్లగా, చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు తొలిరోజు కేవలం ముగ్గురు కుటుంబసభ్యులకు మాత్రమే అవకాశం కల్పించారు.
చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళానికి కాస్త విరామం ఇచ్చారు. యువగళం కారవాన్ ను రాజమండ్రిలోనే ఉంచగా, చంద్రబాబు కుటుంబసభ్యులు భువనేశ్వరి, లోకేష్ ఆయన సతీమణి బ్రాహ్మణి, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్ చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రికి వెళ్లారు. ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించడంతో భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణిలు జైలులోకి వెళ్లి చంద్రబాబును కలసి పరామర్శించారు. ఏం భయపడవద్దని, న్యాయం తమవైపే ఉందని కుటుంబసభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.
బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్ కూడా రాజమండ్రికి వెళ్లగా, వారికి మాత్రం నిరాశే ఎదురైంది. అయితే బాలయ్య ఇద్దరు కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్వి రాజమండ్రి జైలు వద్ద కనిపించడం ఆసక్తికరంగా మారింది. బ్రాహ్మణి అయితే చంద్రబాబుని అలా చూసి కన్నీరు కూడా పెట్టుకుందని అంటున్నారు.అయితే రాజమండ్రిలో ఉన్న నారా లోకేష్, పార్టీ నాయకులతో నిరంతరం సమాలోచనలు జరుపుతున్నారు. సత్యమే గెలుస్తుందని, అధైర్య పడవద్దని ఆయన అభిమానులు, కార్యకర్తలకు సూచించారు. శాంతి యుత నిరసనలపై హత్యాయత్నం కేసులు పెట్టడం, సీఎం జగన్ లో ఉన్న భయానికి నిదర్శనం అన్నారు లోకేష్.