Chandra Babu : ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రోగ్రాంలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై విమర్శల దాడి చేశారు. దేశంలో పేద ముఖ్యమంత్రిగా చెప్పుకునే జగన్ లండన్ ప్రయాణం కోసం ఎంత ఖర్చుపెట్టారో లిస్టు చదివారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి తలపైన అప్పులు పెట్టి జగన్ మాత్రం లండన్ లో విహారయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో పంట నష్టపోతే పెట్టుబడి రాయితీ పేరుతో ఆర్థికసాయం చేసేవారని, ఇప్పుడు అవేవీ లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెదేపా హయాంలో కరవు జిల్లా అనంతపురాన్ని ఆదుకున్నామని, పెట్టుబడి రాయితీని అనంతపురం జిల్లానుంచే ప్రారంభించామని, వాతావరణ బీమానూ ఇక్కడినుంచే మొదలుపెట్టామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఉరవకొండ నియోజకవర్గం కౌకుంట్లలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు కౌకుట్ల గ్రామ పరిధిలోని హంద్రీనీవా కాలువ, పవన విద్యుత్ ప్రాజెక్ట్, డ్రిప్ ఇరిగేషన్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన మా ప్రభుత్వం మరియు రైతులకు అండగా నిలిచిందని కానీ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో హంద్రీనీవా పనులకు బిందు సేద్యం పరికరాలకు నిర్లక్ష్యం వహించిందని వీటికి సంబంధించి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.
యువగళం ప్రజాబలంగా మారిందన్నారు. యువగళం వాలంటీర్లపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇసుకను వైసీపీ నేతలు దోచేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌కు ధైర్యం ఉంటే గుత్తికి రావాలని ఏం చేసింది చెప్పాలని చంద్రబాబు సవాల్ చేశారు. రాష్ట్రంలో అరాచకపాలన పోవాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. ఈ ఏడాది వర్షాభావంతో ఖరీఫ్‌లో వేరుసెనగ నిలువునా ఎండినా కనీసం అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి చూడలేదు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసేశారు’ అని చంద్రబాబు విమర్శించారు.