Ceiling Fan : ఈ రోజుల్లో సీలింగ్ ఫ్యాన్ ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఏసీలు ఉన్నా కూడా తప్పనిసరి ప్రతి ఒక్క ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ తప్పనిసరి. అయితే ఇన్నాళ్లు మంచి కంపెనీలు చూసుకుంటూ సీలింగ్ ఫ్యాన్ కొనేవారు. కాని ఇప్పడలా కాదు. సీలింగ్ ఫ్యాన్ పై కేంద్రం కొన్ని ఆంక్షలు విధించింది. ఫ్యాన్ విక్రయించే వ్యాపారులు, తయారుచేసే సంస్థలకు కొత్త నిబంధనలు పెట్టింది. ఇకపై ఫ్యాన్‌లపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS)మార్కు ఉన్న ఫ్యాన్‌లనే విక్రయించాలని కొత్త కండీషన్ పెట్టింది కేంద్రం. నాణ్యతలేని ఫ్యాన్‌ల దిగుమతికి అడ్డుకట్ట వేయడంతో పాటు దేశీయ తయారీ సంస్థలను ప్రోత్సహించాలనే ఈ నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో విక్రయించే వందల రకాల కంపెనీలు, వేల డిజైన్లలో వస్తున్న సీలింగ్ ఫ్యాన్‌లలో చాలా వాటిల్లో నాణ్యత లేకపోవడం వల్లే ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఆగస్ట్ 9న ఓ నోటిఫికేషన్ జారీ చేయగా, ఇప్పటి నుండి ప్రతి ఒక్కరు ఫ్యాన్ కొనేటప్పుడు కాస్త ఆచితూచి అడుగులు వేయాలి. ఇప్పటి వరకు సీలింగ్ ఫ్యాన్‌లకు బిఐఎస్ సర్టిఫికేషన్ రూల్స్ లేవు. కాని ఇకపై బిఐఎస్ మార్క్ లేని ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్ల ఉత్పత్తి చేయడం, విక్రయించడం,దిగుమతి చేసుకోవడం కలిగి నిషేధమని డీపీఐఐటీ ఈ నోటిఫికేషన్‌లో పేర్కొంది. సీలింగ్ ఫ్యాన్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ..నోటిఫికేషన్ విడుదల చేసిన ఆరు నెలల తర్వాత నుంచి అమల్లోకి రానున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే బీఐఎస్ చట్ట ప్రకారం రెండేళ్ల జైలుశిక్ష లేదా రెండు లక్షల జరిమానా విధిస్తారు.
రెండవసారి అంతకంటే ఎక్కువ సార్లు రూల్స్ బ్రేక్ చేస్తే వారికి 5లక్షల జరిమానా విధిస్తారట. వస్తువుల విలువకు 10 రెట్ల జరిమానా వసూలు చేస్తారు. ఎంఎస్‌ఎస్‌ఈ సెక్టార్‌కు మాత్రమే ఈ క్వాలిటీ కంట్రోల్‌ను అమలు చేసేందుకు 12నెలల పాటు గడువు ఇస్తున్నట్లుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మరి ఈ సారి ఫ్యాన్ కొనేటప్పుడు కాస్త ఆచితూచి అడుగులు వేయండి.