RBI On EMI : మీరు మీ బ్యాంకుల్లో లేదంటే ఏదైనా ఒక కార్ లోన్, హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే.. మీరు దాన్ని తిరిగి చెల్లించడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారా.. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చిన ఈ నియమాలు, నిబంధనలను మీరు తెలుసుకుని డిఫాల్టర్ ముద్ర నుంచి బయట పడండి. ఒకటి, ఇది మిమ్మల్ని డిఫాల్టర్ నుండి కాపాడుతుంది. రెండవది మీ లోన్ వడ్డీ లేదా EMIని తగ్గించడంలో సహాయపడుతుంది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ దేశంలోని ప్రజల ఖర్చుల అలవాట్లను రుణాలు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా పర్యవేక్షించే పనిని చేస్తుంది.
వ్యక్తిగత రుణాలు కూడా కోవిడ్ పూర్వ స్థాయి నుంచి పెరిగాయని వెల్లడించింది. ఈ నివేదిక ఆర్‌బీఐకి హెచ్చరికగా మారింది. రుణం తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం కలిగించేందుకు..ఆర్బీఐ అనేక మార్గదర్శకాలను రూపొందించింది. రుణ ఎగవేతదారులకు ఇది ఉపశమనంగా చెప్పవచ్చు. ఇది రుణాన్ని తిరిగి చెల్లించడానికి వారికి మరింత సమయం ఇస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు రూ.10 లక్షల రుణం తీసుకున్నారనుకోండి.. కానీ మీరు దాన్ని పూర్తిగా చెల్లించలేకపోతున్నారు.
కాబట్టి ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, మీరు దానిని తిరిగి చెల్లించవచ్చు. మీరు రూ. 5 లక్షలు చెల్లించాలి, మిగిలిన రూ. 5 లక్షలను మీరు చాలా కాలం పాటు క్రమంగా తిరిగి చెల్లించవచ్చు. ఈ విధంగా మీ ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది. మీ నుంచి లోన్ డిఫాల్టర్ ట్యాగ్‌ను తీసివేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లోన్‌ని పునర్నిర్మించడం మీకు మంచి ఎంపికగా మారుతుంది. ఒక వ్యక్తి రుణ ఎగవేతదారుగా ఉండటం అతని క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ హెల్త్ రెండింటినీ పాడు చేస్తుంది. ఇది భవిష్యత్తులో మీరు రుణాలు తీసుకునే దారులను క్లోజ్ చేస్తుంది.