Chiranjeevi : స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి అంచెలంచెలుగా మెగాస్టార్‌గా ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే వినోదంతో పాటు వీక్షకులకు ఏదో ఒక మెసేజ్ కచ్చితంగా ఉంటుంది. అలా ఆయన సినిమాలు చేస్తారు. అందులో భాగంగానే 150కి పైగా చిత్రాలలో ఆయన నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే 1983 సంవత్సరం చిరంజీవికి క్రేజీ ఇయర్ అని చెప్పాలి. ఆ సంవత్సరం ఆయన 15 సినిమాలు చేస్తే అందులో 13 హిట్ కాగా, రెండు ఫ్లాప్ అయ్యాయి. ఆ సంవత్సరం విడుదలైన మా ఇంటి ప్రేమాయణంలో చిరు అతిథి పాత్ర పోషించారు. ఈ సినిమా మంచి విజయమే సాధించింది.
1983లో విడుదలైన మరో చిత్రం ప్రేమ పిచ్చోళ్లు .ఇందులో రాధిక కథానాయికగా నటించింది. ఈ చిత్రం ఆ నాటి యువతరాన్ని ఆకర్షించి పెద్ద హిట్ కొట్టింది. ఫిబ్రవరి 5న విడుదలైన పల్లెటూరి మొనగాడు చిత్రం కూడా మంచి విజయం సాధించింది. విశాఖపట్నం, విజయవాడ కేంద్రాలలో వంద రోజులకి పైగా ప్రదర్శించబడింది. ఇక కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మార్చి 11న అభిలాష అనే చిత్రం విడుదలైంది. ఈ మూవీ కూడా మంచి విజయమే సాధించింది. ఇక కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన ఆలయ శిఖరం మే 7న విడుదలైంది. ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్ద హిట్ కాలేకపోయింది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన శివుడు శివుడు శివుడు చిత్రం జూన్ 9న విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర ప్లాఫ్‌గా నిలిచిన ఈ సినిలో చిరు డ్యాన్స్ కి మంచి పేరు వచ్చింది.
చిరంజీవి, కృష్ణంరాజులు హీరోలుగా రూపొందిన పులి బెబ్బులి చిత్రం కమర్షియల్ గా యావరేజ్‌గా ఆడింది. గూడాచారి నెం1 చిత్రం జూన్ 30న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.మగహరాజు అనే చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయమే సాధించింది. రోషగాడు చిత్రం జూలై 29న విడుదల కాగా, ఈ చిత్రం నెగెటివ్ టాక్ వచ్చిన కమర్షియల్‌గా యావరేజ్ విజయం సాధించింది. ఇక సింహపురి సింహం అక్టోబర్ 20న విడుదల కాగా, ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది.చిరంజీవి కెరీర్‌లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రంఖైదీ.ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాపు దర్శకత్వం వహించిన మంత్రిగారి వియ్యంకుడు కూడా మంచి విజయమే సాధించింది. డిసెంబర్ 29న విడుదలైన సంఘర్షణ కూడా మంచి సక్సెస్ సాధించింది.
https://youtube.com/watch?v=2yBBxj9Qiy0