Undavalli Arun Kumar : జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో ఏపీ లోని పలు ప్రాంతాలు తిరుగుతున్న విషయం తెలిసిందే. గత నెలలో వారాహి యాత్ర మొదటి షెడ్యూల్ ఉభయ గోదారి జిల్లాలో జరగగా, అది విజయవంతంగా పూర్తైంది. ఇక సోమవారం నుంచి రెండో విడత వారాహి యాత్రకు సిద్ధమయ్యారు పవన్ . యాత్ర షెడ్యూల్ ను జనసేన పార్టీ వర్గాలు విడుదల చేశాయి. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు వారాహి యాత్ర ప్రారంభం అవుతుంది. ఏలూరులో బహిరంగ సభ నిర్వహిస్తారు పవన్. 10వ తేదీన జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. మంగవారం సాయంత్రం పార్టీ నేతల సమావేశం అవుతారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ యాత్రలో రెండు బహిరంగ సభల్లో పవన్ పాల్గొంటారు.
అయితే వారాహి యాత్ర తొలి షెడ్యూల్ విజయవంతమైందని కొందరు అంటుంటే మరి కొందరు అట్టర్ ప్లాప్ అంటున్నారు. తాజాగామాజీ కాంగ్రెస్ ఎంపీ మరియు అడ్వకేట్ అయిన రాజమండ్రి నేత ఉండవల్లి అరుణ్ కుమార్.. పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలో చేసిన వారాహి యాత్ర గురించి తన అభిప్రాయాన్ని చెప్పారు. ప్రస్తుత రాజకీయాల గురించి మంచి అవగాహన ఉన్న ఉండవల్లి పవన్ చేసిన వారాహి యాత్ర ప్రజలలో మంచిగా దూసుకువెళ్లింది అన్నారు. పవన్ చేసిన ఈ యాత్ర సక్సెస్ అయిందని కంఫర్మ్ చేశాడు. తాను ఏమి చేస్తాడు అన్న విషయం స్పష్టంగా ప్రజలకు చెప్పాడని పవన్ ను ఉద్దేశించి అన్నాడు ఉండవల్లి.
అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి రాజకీయాల గురించి మాట్లాడే ఉండవల్లి ఈ సారి పవన్‌కి పాజిటివ్‌గా మాట్లాడడం పట్ల జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లి ఏమైన జనసేనలో చేరతాడా ఏంటి అని కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కాని ఆయన రాజకీయాలలోకి వచ్చే ఆలోచన లేదని ఆ మధ్య చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. పవన్ యాత్రకి బాగానే ఆదరణ దక్కిన పవన్ కొన్ని విషయాలలో పొంతన లేకుండా మాట్లాడడని ఉండవల్లి అన్నారు. ఇక పవన్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీబిజీగా ఉంటున్నారు. ఆయన నటించిన బ్రో సినిమా జూలై 28న విడుదల కానుండగా, ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.