Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ భీమవరం సభలో వైసీపీ నాయకులతో పాటు సీఎం జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి సారి తన పెళ్లిళ్ల గురించి వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శకులకి గట్టిగా సమాధానం ఇచ్చారు పవన్. భీమవరం సభలో పవన్ కల్యాణ్ మునుపటికంటే మరింత ఆవేశంగా మాట్లాడారు. తాను ప్రభుత్వ పాలసీలపై మాట్లాడుతుంటే .. వ్యక్తిగతంగా తనపై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో పెరిగిన సీఎం జగన్ వ్యక్తిగత జీవితం గురించి లోతైన విషయాలు తనకు చాలా తెలుసన్నారు పవన్.
మీ గురించి, మీ మంత్రుల గురించి చిట్టా మొత్తం నేను విప్పగలను. మీ మనిషిని ఎవరినైనా నా దగ్గరికి పంపించండి. నేను చెప్పేది వింటే చెవుల్లో నుంచి రక్తం కారుతుంది’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. నాకు సంస్కారం అడ్డు వస్తుంది కాబట్టే వాటి గురించి మాట్లాడడం లేదు. పాలసీలు గురించి మాట్లాడుతుంటే నా వ్యక్తిగతం మాట్లాడుతున్నారు. విప్లవ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని, చిల్లర మాటలు మాట్లాడితే ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసన్నారు. వైసీపీ నేతల నోటికి సైలెన్సర్లు బిగించుకోవాలని సెటైర్లు పేల్చారు పవన్.
భీమవరంలో ఓడిపోయినా కూడా నేను పట్టించుకోలేదు. మనకు ఓటమి, గెలుపు ఉండవు.. ప్రయాణమే ఉంటుంది. నిండా మునిగినోడికి చలేంటి. ఎవరు గెలుస్తారో చూద్దాం.. సవాల్. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీతో సై అంటే సై. ఈసారి ఈ జిల్లాల్లో వైసీపీని ఒక్క సీటు గెలవనీయం’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ నేతలు తమ నోర్లకు సైలెన్సర్లు బిగించుకుంటే.. జనసేన సైనికులు బైకులకు సైలెన్సర్లు బిగించుకుంటారని పవన్ వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, ఉపాధి కోసం మనం కృషి చేసుకుందాం అని పవన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మీరు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా. జనసేన సత్తా ఏంటో అసెంబ్లీలో చాటాలి. ఏదేమైనా నా సేవ, పోరాటం మాత్రం ఆపేదే లేదంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
https://youtube.com/watch?v=Dp_gjhdJVG4