CM KCR : ఒకప్పుడు రాజకీయాలని శాసించిన చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. తెలంగాణలో ఉనికి కోల్పోయిన చంద్రబాబు ఇప్పుడు ఏపీలో కూడా పట్టు కోల్పోతున్నట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబునాయుడుకు 24 గంటలూ.. 365 రోజులు కొమ్ముకాసే ఎల్లో మీడియానే ఇటీవల గాలి తీసేసింది. జాతీయ స్థాయిలో చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయినట్లు స్పష్టంగా చెప్పింది. మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆలోచనతో చంద్రబాబు తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాల కారణంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ముందు చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయినట్లు ఇఈవల ఎల్లో మీడియా యాజమాన్యం తేల్చేసింది. జాతీయ స్థాయిలో ఒకప్పుడు చక్రం తిప్పిన చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ఇలా అయిపోయిందని బాధపడిపోయింది.
గతంలోను చంద్రబాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పబోతున్నట్టు ప్రకటించాడు. అప్పుడు దీనిపై కేసీఆర్ తనదైన పంచ్‌లు వేశాడు. చంద్రబాబుకి ఇంగ్లీష్ మాట్లాడడం వస్తదా, రెండు ముక్కలు హిందీ వస్తదా. జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం అంటే ఉత్త ముచ్చటేనా అంటూ ఆయనపై తనదైన శైలిలో పంచులు వేశారు. అయితే రాజకీయాలలో చంద్రబాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నైపుణ్యం ఆయన సొంతం. రెండు సార్లు బీజేపీకి అధికారం దక్కకుండా చేసీన్ టాలెంట్ పక్కాగా బాబుదే. 1996లో జరిగిన లోక్ సభ ఎన్నికలో అతి పెద్ద పార్టీగా బీజేపీ గెలిచి వాజ్ పేయ్ ప్రమాణం చేసినా కూడా కుర్చీ నుంచి దించి యునైటెడ్ ఫ్రంట్ ని అప్పటికపుడు కట్టి దేవేగౌడాను ప్రధానిగా చేసిన వ్యూహం బాబుది.
అంతే కాదు 1999 దాకా బీజేపీకి బాబు అలా చుక్కలు చూపిస్తూనే ఉన్నారు. 2018 లో బాబు తన విశ్వరూపమే చూపారు. ఏపీ కంటే ఎక్కువగా మోడీని ఓడించేందుకే ఆయన ఎంతో కృషి చేశారు. అయితే వేవ్ మోడీకి గట్టిగా ఉండడంతో ఆయన రెండవసారి గెలిచారు. ఏపీలో బాబు ఓడిపోవడంతో ఆయన ఆశలు అన్నీ పాతాళానికి పడిపోయాయి. ఇక నాటి నుంచి బీజేపీతో జట్టు కట్టి ముందుకు సాగాలని ప్రయత్నం చేస్తూ వస్తున్నారు చంద్రబాబు. దానికి కారణం కేంద్రంలో బీజేపీ ఉంది. ఏపీలో ఎన్నికల వేళ ఆ పార్టీ సహకారం తమకు ఉంటుందన్న భావనలో బాబు ఉన్నారు.