Pawan Kalyan : ఇటీవల కోట శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న క్రమంలో నటరత్న, విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గురించి కోటా శ్రీనివాసరావు గొప్పగా మాట్లాడారు… సాధారణంగా దివ్వెలో నూనె పోసి అగ్గిపెట్టెతో దానిని వెలిగిస్తాం. కానీ ఎన్టీఆర్ మాత్రం తన వాగ్దాటితో మాట్లాడుతుంటే.. ఉప్పొంగి … ఆ వత్తి దానంతంట వెలిగిపోయింది. ఇంకో రామారావు పుడితే తప్ప ఈ భూమి మీద మరో రామారావు ఉండరు అని అన్నారు అదే విధంగా ‘‘ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు? ఎవరు, ఎవరికి ఎంత ఇచ్చారు? ఎవరికైనా తెలుసా?
వాళ్లు ఏనాడూ తమ పారితోషికం గురించి బాహాటంగా మాట్లాడలేదు. కానీ ఇప్పటి హీరోలు రోజుకి రూ.2 కోట్లు, రూ.6 కోట్లు తీసుకుంటున్నాం.. 40 కోట్లు.. 50 కోట్లు అని పబ్లిక్ గా చెబుతున్నారు’’ అని అన్నారు. అసలు ఇప్పుడు సినిమా అనేదే లేదని, అంతా సర్కసేనని ఎద్దేవా చేశారు. విషాద గీతాలకు కూడా డ్యాన్స్ లు చేస్తున్నారని సెటైర్లు వేశారు. అసలు మ్యునరేషన్ ఎంత తీసుకొంటామనేది చెప్పడం మంచి పద్దతి కాదు. ఆ రోజుల్లో ఎన్టీరామారావు 67 ఏళ్ల వయసులో శ్రీదేవి నటిస్తుంటే.. ఆయన వయసు ఎవరికి తెలియదు.
రామారావు, శ్రీదేవీ బాగా చేశారని చెప్పుకొనే వారు. ముసలాయన చేశాడని ఎవరు అనలేదు. నేను ఇప్పుడు నటిస్తే.. ముసలాయన నటిస్తున్నాడు అంటారు. కాబట్టి ఎన్టీఆర్ మహానుభావుడు. ఆయన ఎంత తీసుకొన్నారనే విషయం బయటకు చెప్పలేదు అని కోట శ్రీనివాసరావు అన్నారు. అయితే కోట స్పీచ్‌లో రెమ్యునరేషన్ గురించి చెప్పడం అది పవన్ ని ఉద్దేశించే అన్నాడని వార్తలు బయటకు రావడం ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది. అయితే కోట వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ తన సన్నిహితుల దగ్గర మాట్లాడుతూ..నేను ఎంత తీసుకుంటే ఆయనకేంటి..నాకు డబ్బు ముఖ్యం కాదు. ప్రజల శ్రేయస్సే ముఖ్యం అని చెప్పినట్టు తెలుస్తుంది.