Puli 19th Century : ఇటీవలి కాలంలో డబ్బింగ్ సినిమాలకి మంచి ఆదరణ పెరుగుతుంది. కాంతార సినిమా డబ్బింగ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ఈ క్రమంలోనే మరో డబ్బింగ్ రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చి మంచి ఆదరణ పొందుతుంది. గత ఏడాది రిలీజ్ అయిన పథోంపథం నూట్టండు అనే యాక్షన్ పెరియాడికల్ మూవీ ఇప్పుడు తెలుగులో ”పులి 19వ శతాబ్దం” పేరుతో అమెజాన్ ప్రైమ్ వీడియాలో రిలీజ్ అయ్యింది.ఈ సినిమా మంచి కంటెంట్ బేస్ తో రావడంతో తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తుంది. . పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో సిజు విల్సన్ హీరోగా నటించాడు. ఆనంతపద్మనాభ స్వామి గుడిలో దొంగతనం జరుగుతోంది. ఆ దొంగను కత్తితిప్పడంలో నేర్పరి అయిన వేళాయుధ ఫణిక్కర్ అనే పోరాట యోధుడు ఎలా పట్టుకున్నాడనే నేపథ్యంలో సినిమాని తెరకెక్కించారు.
19వ శతాబ్దానికి చెందిన ట్రావెన్ కోర్ వంశస్థుల కాలం నాటి కథతో దర్శకుడు వినయన్ పులి 19వ శతాబ్దం సినిమాను చిత్రీకరించారు. ఇందులో కయదు లోహర్, దీప్తి సతి, పూనమ్ బజ్వా, అనూప్ మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ఈ సినిమా ఇప్పుడు ఓటిటీ ప్రేక్షకులను అలరిస్తుంది.సినిమాలో మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అని ఈ సినిమా మరోసారి నిరూపించింది.అందుకే కంటెంట్ బేస్ సినిమాలన్నీ డబ్బింగ్ అయ్యి ఇప్పుడు ఓటిటీలో అలరిస్తున్నాయి.
ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ థియేటర్లలో అభిమానులకి పూనకాలు తెప్పించాయి.. పులి తెలుగు వెర్షన్‌కు ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ వస్తోందని చిత్ర యూనిట్ చెబుతోంది. మలయాళంలో దాదాపు 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ యాభై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిందని చిత్ర వర్గాలు తెలియజేశాయి.. ఫిబ్రవరిలో ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజైంది. థియేటర్లలో విడుదలైన మూడు నెలల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి రావడం గమనార్హం.