Soppana Sundari : ఓటీటీలో ప్రతి వారం వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకులని అలరిస్తుంటాయి. ఈ క్రమంలోనే సొప్పన సుందరి అనే చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. టాలీవుడ్ లో పలు సినిమాలతో మెప్పించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇందులో లీడ్ రోల్ చేసింది. చిత్ర కథ విషయానికి వస్తే.. ఇందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అహల్య (ఐశ్వర్య రాజేష్) ఓ గోల్డ్ షాపులో సేల్స్ గర్ల్ గా పనిచేస్తుంటుంది. ఈమెకి రోజు గడవడమే కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి ఓ ప్రముఖ జ్యూవెల్లరీ స్టోర్ బంపర్ డ్రాలో రూ.10 లక్షలు విలువైన కారు బహుమతిగా వస్తుంది.
అక్కడి నుంచి వీళ్ల లైఫ్ లో ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. కామెడీ మాత్రం ఫుల్‌గా ఉంటుంది. ‘సొప్పన సుందరి’.. థ్రిల్ చేస్తూ కామెడీ అందించే విషయంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ఎన్నో సీన్స్ మిమ్మలని థ్రిల్‌కి గురి చేస్తుంటాయి. ‘పరాయి వాడి సొమ్ము పాము లాంటిది’, ‘దురాశ దుఖానికి చేటు’.. అనే చిన్న లైన్ ఆధారంగా ఈ మూవీని తీశారు. ఫ్యామిలీ గొడవలతో ఫస్టాప్ ని నడిపించేసిన దర్శకుడు.. అసలు విషయాన్ని మొత్తం సెకండాఫ్ కోసం దాచుకున్నాడు. సెకండాఫ్ లో కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. కొన్ని కొన్ని సీన్లు బోర్ కొడతాయి .ఈ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూ, మరోవైపు టెన్షన్ పడుతూ ఉంటాం.
సినిమాని కామెడీగా తీసినప్పటికీ.. దొంగతనం, మర్డర్, దెబ్బలాడుకోవడం, శారీరకంగా ఇబ్బంది పెట్టడం లాంటి చాలా విషయాల్ని టచ్ చేస్తూ ప్రేక్షకులకి వినోదం పంచే ప్రయత్నం చేశాడు. క్లైమాక్స్ లో అహల్య.. తన తల్లి, అక్కతో చేసే ఓ ఫైట్ అయితే తెగ నవ్విస్తుంది. అహల్యగా ఐశ్వర్య రాజేష్ ఎంత చేస్తే సరిపోతుందో అంత ఫెర్ఫెక్ట్ గా యాక్టింగ్ చేసింది. అహల్య తల్లిగా చేసిన దీప శంకర్ అయితే నెక్స్ట్ లెవల్ కామెడీ చేసింది. డార్క్ కామెడీ థ్రిల్లర్స్ తీసేటప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేయడం కాస్త కష్టం. కాని దర్శకుడు బాగా మేనేజ్ చేశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందించిన విశాల్ చంద్రని కూడా మెచ్చుకోవాలి. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా మంచి టైం పాస్ మూవీగా చెప్పవచ్చు.