Custody Movie Review : అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన నాగ చైతన్య ప్రతి సినిమాతో ప్రేక్షకులని అలరించేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటాడు. తాజగా కస్టడీ చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. ఈ చిత్రం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కగా , పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇచ్చారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులని అలరించిందా లేదా అనేది చూద్దాం.
చిత్ర కథ విషయానికి వస్తే.. శివ(నాగ చైతన్య ) నిజాయితీ గల కానిస్టేబుల్. అతను తను ప్రేమించిన రేవతి(కృతి శెట్టి )ని పెళ్లి చేసుకోని సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. కాని సఖినేటి పల్లి పోలీస్ స్టేషన్లో రాజన్న ( అరవింద్ స్వామి) ని అరెస్ట్ చేసి ఉంచడంతో శివ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. రేవతికి మరో పెళ్లి నిశ్చయించారనే విషయం తెలుసుకున్న శివ ఆమెని తన తో పాటు తీసుకెళతాడు.మరోవైపు రాజన్న ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకున్న శివ ఆయనని కూడా తనతో తీసుకెళతాడు. ఈ క్రమంలో శివ కోసం పోలీసులు వెతుకుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.
కథ, కథనాల్లో పెద్దగా దమ్ములేకపోవడంతో సినిమా ప్రేక్షకులని పెద్దగా అలరించదు. శివ పాత్రల నాగ చైతన్య బాగానే అలరించాడు. సినిమా కోసం బాగా కష్టపడినట్టు మూవీ చూసిన వారికి అర్ధమవుతుంది. కృతి శెట్టి రేవతి పాత్రలో ఉన్నంతలో పర్వాలేదు, ఒక నాగ చైతన్య కి సమానంగా స్క్రీన్ టైం ఉన్న అరవింద్ స్వామి అంతే అద్భుతంగా తన పాత్రని పండించాడు, మిగతా నటీనటులు కూడా తమ పాత్రల మేర అలరించారు. ఇక వెంకట్ ప్రభు సినిమాని తమిళ్ నేటివిటీకి అనుగుణంగా తెరకెక్కించాడు. సాంకేతికంగా కస్టడీ చిత్రం చాల బాగుంది, ఇక ఎస్ ఆర్ కతిర్ ఛాయాగ్రహణం సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, యువన్ శంకర్ రాజా పాటలు అంతగా ఆకట్టుకొవూ కానీ నేపధ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని మరో మెట్టు ఎక్కించాయి.