Virupaksha Movie Review : బైక్ ప్రమాదం కారణంగా దాదాపు ఏడాదిన్నరపైనే సినిమాలకు దూరమయిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత విరూపాక్ష అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు శుక్రవారం(నేడు) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో కార్తిక్ దండు దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అగ్ర దర్శకుడు సుకుమార్ స్క్రీన్‌ప్లేను అందిస్తూనే బీవీఎస్ఎన్ ప్రసాద్‌తో కలిసి విరూపాక్ష సినిమాను నిర్మించగా, సంయుక్త హీరోయిన్‌గా నటించింది. విరూపాక్ష సినిమా ఎలా ఉంది అంటే.. ఈ చిత్రం స్టోరీ 1980-90వ దశకంలో రుద్రవరం అనే విలేజ్‌లో జరిగినట్టు చూపించారు.
రుద్రవరం అనే గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలు ఎంతో భయానకంగా ఉంటాయి. ఆ ఊరిలో అనుమానాస్పద మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అయితే ఆ మిస్టరీని సాయి తేజ్ చేదిస్తాడు. ఆ మిస్టరీ డెత్స్ వెనకాల ఎవరున్నారు? ఆ ఊరిని పట్టిపీడుస్తున్న శక్తి ఏంటి? హీరో దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమా కథగా చెప్పవచ్చు. విక్రాంత్ రోణకు అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చిన అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు ఇచ్చిన నేపథ్య సంగీతం అదిరిపోయింది. రుద్రవనం మిస్టరీని ఛేదించే సూర్య అనే యువకుడిగా సాయిధరమ్‌తేజ్ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా, సెకండాఫ్‌లో సీరియస్ రోల్‌లో చక్కటి వేరియేషన్ చూపించాడు.
ఫస్టాఫ్‌లోనే థ్రిల్ మూమెంట్స్ ఉన్నా… ఆ టెంపో పూర్తిగా కొనసాగించలేకపోయారు.. ఊరిలో జరిగే హత్యల వెనకున్న మిస్టరీని ఛేదించే క్రమంలో ఒక్కో చిక్కుముడిని రివీల్ చేయడంతో పాటు సెకండాఫ్‌ను చాలా ఎంగేజింగ్‌గా అయితే తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్. కథలో చిన్న చిన్న లోపాలు ఉన్నా…. సుకుమార్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆడియెన్స్‌ను ఈ సినిమా చివరి వరకు థ్రిల్ కి లోన్ చేసింది.. సాయితేజ్‌కు మంచి కం బ్యాక్ హిట్ అని ఫ్యాన్స ఫుల్ ఖుష్ అవుతున్నారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, వీఎఫ్ఎక్స్ తో పాటు ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రాణం పోశాయి. అజయ్, సునీల్, బ్రహ్మాజీతో పాటు ప్రతి పాత్రకు కథలో ఇంపార్టెన్స్ ఇస్తూ దర్శకుడు ఈ సినిమాను హృద్యంగా తెరకెక్కించాడు.