Dasara Movie : నాని, కీర్తి సురేష్ ప్రధా పాత్రలలో రూపొందిన చిత్రం దసరా. సుకుమార్ వద్ద రంగస్దలం వంటి చిత్రాలకు అసిస్టెంట్ గా వర్క్ చేసిన శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమాపై నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉంటూ వచ్చాడు. “2023 సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్న గొప్ప సినిమా దసరా” అని చెప్పడంతో ఈ సినిమాపై ఇంకాస్త హైప్ క్రియేట్ చేసింది. పలు రికార్డ్స్ ని తిరగరాస్తూ అన్నింటా దూసుకుపోతున్న ఈ సినిమా పలు వివాదాలలో నిలుస్తుంది.సినిమాకి సంబంధించిన పోస్టర్ లో బ్లాక్ బస్టర్ రా బాంచెత్ అని వేశారు.
ఆ సినిమాలో హీరో భాషతో పోస్టర్ వేయడం మాత్రం అంతగా బాగాలేదని అసలు మాట. బ్లాక్ బస్టర్ రా బాంచెత్ అంటే ఇది ఎవరిని అంటున్నట్టు.. ఏ హీరోని లేదా హీరోలని ఉద్దేశించి చెబుతున్నట్టు అని మీడియాలో డిస్కషన్స్ మొదలైంది. ఇర ఈ సినిమాలో తమను కించపరిచేలా ఈ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని అంగన్ వాడీ కార్యకర్తలు కొంత మంది ఆందోళనకు దిగారు. వెంటనే ఆ సీన్లను తొలగించడంతో పాటు సినిమా బృందం తమకు క్షమాపణలు చెప్పాలని వానే డిమాండ్ చేశారు. ఇంతకీ ఆ సినిమాలో అభ్యంతరకర సీన్లు ఏంటంటే? కీర్తి సురేష్ ఈచిత్రంలో వెన్నెల అనే క్యారెక్టర్ చేయగా. ఇందేలో ఆమె అంగన్ వాడీ కార్యకర్త.
ఒకానొక సందర్భంలో తను పిల్లల కోసం ఇవ్వాల్సిన కోడిగుడ్లను అమ్ముకుంటుంది. అంతేకాదు, మరికొన్ని గుడ్లను తీసుకెళ్లి తమ కుటుంబ సభ్యులకు ఇవ్వడంతో ఈ సన్నీవేశాల మీద అంగన్ వాడీలు ఫైర్ అవుతున్నారు.. పలు చోట్ల థియేటర్ల ముందు ధర్నాలు నిర్వహించారు. ‘దసరా’ సినిమాలోని ఆ సీన్లను తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు తేల్చి చెప్పారు. ఈ సినిమా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వీర్లపల్లి అనే గ్రామం నేపథ్యంలో రూపొందించారు. లాంగ్ రన్ లో రెండు మిలియన్ డాలర్లు వసూళు చేసే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.