Yamuna : యమున అంటే ఈ తరం వాళ్లకి పెద్దగా పరిచయాలు లేకపోవచ్చు ఒకప్పుడు హీరోయిన్‌గా తెలుగు దక్షిణాది చిత్రాల్లో చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత బుల్లి తెరపై కూడా ఎంట్రీ ఇచ్చి తనదైన గుర్తింపు దక్కించుకున్న ఈమె తన జీవితంలోనూ ఇబ్బందికరమైన, చేదు ఘటనలుని చవి చూసింది. పన్నెండేళ్ల క్రితం ఓ వ్యభిచార కేసులో యమున పట్టుబడింది అని వార్తలు వచ్చాయి. ఇది ఆమెపై చాలా ప్రభావాన్నే చూపించింది. అప్పటి నుంచి ఆమె కెరీర్ డౌన్ అవుతూ రాగా, అయితే దీనిపై యమునకు న్యాయ స్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఘటన గడిచి 12 ఏళ్లు అవుతున్నప్పటికీ యమునకు ఆ నీడలు వెంటాడుతూనే ఉన్నాయి.
యమున 2011లో బెంగుళూరులోని ఓ హోటల్‌లో వ్యభిచారం కేసులో పట్టుబడిందనే వార్త అప్పట్లో సంచలనం రేపింది. అది జరిగి చాలా రోజులే అవుతున్నప్పటికీ ఇప్పటికీ దీని గురించి సోషల్ మీడియాలో తన మీద ఎన్నో అసభ్యకరమైన వార్తలు వస్తున్నాయంటోంది యమున. ఈ సంఘటనకు సంబంధించి చాలా దారుణమైన థంబ్‌నైల్స్‌తో మానసికంగా హింసిస్తున్నారంటూ సోషళ్ మీడియాలో వీడియో విడుదల చేసింది. తన తప్పేం లేదని, తనను కావాలనే ఇరికించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పటికీ ఆ వార్తలు సోషల్ మీడియాలో ఎక్కడో ఒకచోట వస్తూనే ఉన్నాయి.
వీడియోలో మాట్లాడిన యమున.. ‘‘న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ ఇప్పటికీ కొందరు సోషల్ మీడియాలో థంబ్ నెయిల్స్ పెట్టి వీడియోలు పెడుతున్నారు. అవెంతో బాధను కలిగిస్తున్నాయి. నాకు నేనుగా మోటివేట్ చేసుకుందామని అనుకుంటున్నప్పటికీ కుదరడం లేదు. నేను చచ్చిపోయినా వాళ్లు వదిలేలా లేరు. అప్పుడు కూడా థంబ్ నెయిల్స్ పెట్టుకుని డబ్బులు సంపాదిస్తారేమో. నా గురించి ఇండస్ట్రీలో నా మిత్రులందరికీ నేనేంటో తెలుసు. దాంతో వాళ్లు విషయాన్ని అర్థం చేసుకున్నారు. కానీ సోషల్ మీడియా వాళ్లు మాత్రం వదలటం లేదు. నా అభిమానులకు, సన్నిహితులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను’’ అంటూ యమున తన సోషల్ మీడియాలో తెలియజేసింది.