T Krishna : మాచో హీరోగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న హీరో గోపిచంద్. మొదట హీరోగా స్టార్ట్ అయిన గోపీచంద్ తర్వాత విలన్ గా కూడా చేశాడు. మళ్లీ ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. హిట్,ఫ్లాపులతో సంబంధం లేకుండా గోపిచంద్ దూసుకుపోతున్నాడు. అయితే గోపీచంద్ బ్యాగ్రౌండ్ ఏంటి సినీ ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు అనేది చాలా మందికి తెలియదు. నిజానికి గోపీచంద్ నాన్న కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఆయన పేరు తొట్టెంపూడి కృష్ణ కాగా, వరంగల్ కి చెందిన వ్యక్తి. అయితే సినిమాల మీద ఇష్టంతో డిగ్రీ అయ్యాక మద్రాసు వెళ్ళాడు.
అక్కడకు వెళ్లాక వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా అన్ని రంగాల్లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకొని అనుభవం సంపాదించుకున్నాడు. అయితే మద్రాసు వెళ్లగానే హెచ్.ఎం.రెడ్డి వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు ఎమ్ వి రాజన్ దగ్గర ఎడిటింగ్ నేర్చుకున్నాడు .ఆ తరువాత 30కి పైగా చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసి అనంతరం డైరెక్షన్ స్టార్ట్ చేశాడు. ఎన్నో సినిమాలకు డైరెక్ట్ చేసి మంచి విజయాలు అందుకున్న అతను సొంత బ్యానర్ ని కూడా స్టార్ట్ చేశాడు. మలయాళ చిత్రాలకు సైతం డైరెక్ట్ చేసాడు తొట్టెంపూడి కృష్ణ.
దేశంలో దొంగలు పడ్డారు, నేటి భారతం, ఉపాయంలో అపాయం, దేవాలయం, వందేమాతరం, ప్రతిఘటన, రేపటి పౌరులు లాంటి సినిమాలు చేశారు హీరో గోపిచంద్ వాళ్ల నాన్న. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు డైరెక్ట్ చేసిన వ్యక్తి కృష్ణ ముఖ్యంగా మలయాళం సినిమాలో ఆ రోజుల్లో తెలుగు నుంచి వెళ్లిన వ్యక్తి చాలా కొద్దిమందిలో తొట్టెంపూడి కృష్ణ ఒక్కరే. అనారోగ్య కారణాల చేత 1987లో ఆయన మరణించడం జరిగింది క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగం ఈయనకు రావడంతో ఆయన స్వర్గస్తులయ్యారు.