Romamcham : ఇటీవలి కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ఆ కోవలోనే తెలుగులో ‘పెళ్లి చూపులు’, తమిళ్‌లో రీసెంట్ హిట్ ‘లవ్ టుడే’ , కన్నడ మూవీ ‘కాంతార’ చిత్రాలు ఉన్నాయి. ఇవి ఎవరు ఊహించని కలెక్షన్లు సాధించాయి.. ఇప్పుడు ఇదే జాబితాలో మలయాళ చిత్రం ‘రోమాంచం’ చేరింది. కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసి అందరిని అవాక్కయ్యేలా చేసింది.
‘రోమాంచం’ మూవీలో పెద్ద స్టార్స్ ఎవరూ లేరు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సౌబిన్ షాహిర్ ఇందులో మెయిన్ రోల్ చేయగా, ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదలై, నెల రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పటికీ థియేటర్స్లో మంచి వసూళ్లే రాబడుతుంది. అయితే ఈ సినిమా 2007కు సంబంధించినది కాగా, ఓయిజా గేమ్ ఆడే కొంతమంది ఫ్లాట్‌మేట్స్ చుట్టూ తిరుగుతుంది. ఈ హర్రర్-కామెడీ మూవీకి జిత్తు మాధవన్ దర్శకత్వం వహించగా.. ఈ సినిమా విడుదలకు ముందు డిస్ట్రిబ్యూటర్లు దొరకడమే కష్టం కాగా, ఎలాగోలా చిత్రాన్ని విడుదల చేశారు.
ఇప్పుడు ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుందనే చెప్పాలి. ఇప్పుడు ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో మూవీ రీమేక్ రైట్స్ కొనేందుకు చాలా మంది తెలుగు, తమిళ నిర్మాతలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే తెలుగు, తమిళ్‌లో ‘రోమాంచం’ మూవీ రీమేక్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైన మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ఎక్కువగా మలయాళం నుండి రావడం గమనార్హం. ఇటీవల వచ్చిన ‘మాలికాపురం’ అనే చిన్న చిత్రం కూడా రూ. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన అందరిని ఆశ్చర్యపరచిన విషయం తెలిసిందే.