Upasana : టాలీవుడ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన పెళ్లి చేసుకొని దాదాపు పదేళ్లు అవుతుంది. చిరంజీవి అడుగుజాడల్లో హీరోగా టాలీవుడ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. తండ్రి తగ్గ తనయుడుగా రాణిస్తున్నాడు. అంతేకాదు హీరోగా పీక్‌లో ఉండగానే అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను ఐదేళ్లు ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఫ్యామిలీకి, అపోలో ప్రతాప్ రెడ్డి కుటుంబానికి మంచి పేరే ఉంది. 2012 జూన్ 14న రామ్ చరణ్, ఉపాసన పెళ్లి జరిగింది. అప్పట్లో దేశమంతా మాట్లాడుకునేంత ఘనంగా ఈ పెళ్లి జరిపించారు ఇరు కుటుంబ సభ్యులు. ఉపాసన విషయానికొస్తే.. అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది.
అయితే పెళ్లి జరిగి చాలా ఏళ్లు అయిన కొన్ని ఏళ్ల పాటు పిల్లలు కలగలేదు. దీంతో, ఏదో సమస్య ఉన్నట్టుందని… ఉపాసన పిల్లల్ని కనకపోవచ్చనే ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారికి క్లీంకార అనే పేరు పెట్టుకున్నారు. మరోవైపు, తమకు పిల్లలు పుట్టడం ఆలస్యం కావడానికి గల కారణాన్ని ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అమ్మ కావడాన్ని అందరూ గ్రేట్ అనుకుంటారని… తాను మాత్రం డబుల్ గ్రేట్ అనుకుంటానని ఆమె తెలిపారు. తమకు పిల్లలు పుట్టడం లేట్ కావడంతో… ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే కామెంట్లు తన వరకు కూడా వచ్చాయని చెప్పారు. పిల్లల్ని కనడానికి పూర్తిగా సన్నద్ధం అయిన తర్వాతే కనాలని తాను, రామ్ చరణ్ అనుకున్నామని… అందుకే తల్లిదండ్రులు కావడానికి సమయం తీసుకున్నామని వెల్లడించారు.
వ్యక్తిగతంగా తాను, చరణ్ ఎంతో సన్నిహితంగా ఉంటామని… కానీ, వృత్తి పరమైన విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోబోమని ఉపాసన తెలిపారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరం గౌరవం ఇస్తామని చెప్పారు. బిజినెస్ ఉమన్ గా రాణిస్తున్న ఉపాసన… సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ఒకరి కెరియర్లు మరొకరు ఇన్వాల్వ్ అవ్వము.. వ్యక్తిగత విషయాలలో మాత్రమే ఒక్కటిగా ఉంటామంటూ ఉపాసన తెలియజేసింది.