Indraja : తెలుగు సినీ ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు ఇంద్రజ. ఒకప్పుడు హీరోయిన్‌గా తెగ అలరించినప్పటికీ పెళ్లి తర్వాత కాస్త దూరమైంది. టీవీ షో లలో జడ్జిలుగా పాల్గొని వాటిల్లో వేసే జోక్స్ తో పాటుగా అందంగా కనపడటం వలన ఇంద్రజ ఇటీవల చాలా ఫేమస్ అయింది. అజయ్ప్పలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి… ఆ తర్వాత హలో బ్రదర్, పురుష లక్షణం సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన తర్వాత జంతర్ మంతర్ సినిమాలో మెయిన్ రోల్ చేసింది ఇంద్రజ. ఆమె బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మాత్రం సంచలనం అనే చెప్పాలి. ఇంద్రజ కోసం ఆమె భర్త కుటుంబ సభ్యులు కొన్ని అలవాట్లు మార్చుకున్నారు.
ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాతి నుంచి తన భర్త కుటుంబం ఇంట్లో నాన్ వెజ్ వండలేదు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. బయటకు ఇంద్రజ పద్ధతి నచ్చి… అత్తారి కుటుంబం మొత్తం కూడా నాన్ వెజ్ కు దూరం కావడం విశేషం. బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి ఆదివారం వినోదంలో ముంచెత్తే కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా రోజుల తర్వాత నటి ఇంద్రజ తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేసింది. తొలుత ప్రియమైన నీకు సినిమాలోని మనసున ఉన్నది పాటకు డ్యాన్స్ చేయగా.. ఆ తర్వాత గజినీ సినిమాలోని.. రహతుల్ల రహతుల్ల రహుతల్ల వల్ల పాటకు మాస్ స్టెప్స్ వేసి తనలో ఎనర్జీ, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ప్రస్తుతం ఇంద్రజ వీడియో వైరల్‌గా మారింది.
ఇక ప్రతివారం శ్రీదేవి డ్రామా కంపెనీకి ఏదో సినిమా టీం తమ మూవీ ప్రమోషన్స్‌కి గెస్ట్‌గా వచ్చారు. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీకి గెస్ట్‌లుగా ముఖచిత్రం సినిమా టీమ్ స్పెషల్ గెస్ట్‌లుగా వచ్చారు. ఈ చిత్రంలో హుషారు ఫేమ్ ప్రియ వడ్లమాని హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ క్రమంలో ముఖచిత్రం డైరెక్టర్ సందీప్ రాజ్‌తో కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చింది ప్రియా వడ్లమాని. ఈ క్రమంలో హైపర్ ఆది ఆమెను టీజ్ చేయాలని ప్రయత్నించడం.. చివరకు ఆమె అన్నయ్య అని పిలిచి ఆదికి షాకివ్వడం ఆడియన్స్ ని ఎంతగానో అలరించాయి. ప్రోమోనే ఇలా ఉంటే ఇక ఎపిసోడ్ ఎలా ఉంటుందో మరి.