పిల్ల‌ల‌కు ఈ ఆహారాల‌ను ఇస్తే.. కంటి చూపు స‌మ‌స్య‌లు ఉండ‌వు..!

ఈ మ‌ధ్య కాలంలో పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డే పిల్ల‌ల సంఖ్య ఎక్కువ‌వుతోంద‌ని గ‌ణాంకాలు తెలియ‌జేస్తున్నాయి. ప్ర‌స్తుత త‌రుణంలో పిల్ల‌లు ఎక్కువ‌గా చిరుతిళ్ల‌ను తిన‌డానికి అల‌వాటు ప‌డి స‌రైన ఆహారాన్ని తిన‌డం లేదు. పోషకాహార లోపం కార‌ణంగా శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గి త‌ర‌చూ ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌డంతోపాటు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. పోష‌కాహార లోపం కార‌ణంగా పిల్ల‌ల్లో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కంటి స‌మ‌స్య‌లు కూడా ఒక‌టి.

పిల్ల‌ల ఆరోగ్యం వారికి మ‌నం అందించే ఆహారంపైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని వైద్య నిపుణులు తెలియ‌జేస్తున్నారు. పిల్ల‌ల్లో కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే పోష‌కాహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్ల‌ల‌కు ఇచ్చే ఆహారంలో కోడిగుడ్లు ఉండేలా చూసుకోవాలి. కోడిగుడ్ల‌ల్లో ఉండే విట‌మిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే స‌ముద్ర చేప‌ల‌ను వాళ్ల‌కి త‌ర‌చూ ఆహారంలో భాగంగా ఇస్తూ ఉండాలి. చేప‌ల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కంటి ఆరోగ్యంతోపాటు రెటీనా కూడా చ‌క్క‌గా ప‌నిచేసేలా చేస్తాయి. అంతేకాకుండా క‌ళ్లు పొడిబార‌కుండా కూడా ఉంటాయి.

give these foods daily to improve kids eye sight

అలాగే పిల్ల‌ల‌కు ప్ర‌తిరోజూ ఏదో ఒక ఆకుకూర‌ను ఆహారంగా ఇస్తూ ఉండాలి. వీటిల్లో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ ల‌తోపాటు అనేక ర‌కాల మినర‌ల్స్ కూడా ఉంటాయి. ఇవే కాకుండా ఆకుకూర‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్ కూడా ఎక్కువ‌గా ఉంటాయి. పిల్ల‌ల్లో వ‌చ్చే కంటి స‌మ‌స్య‌ల‌తోపాటు మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి వంటి స‌మ‌స్య‌లను త‌గ్గించ‌డంలో, వారిలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఆకుకూర‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాగే పిల్ల‌ల‌కు విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఆహార ప‌దార్థాలను ఇవ్వాలి. మామిడి, నారింజ‌, జామ‌, క్యారెట్ వంటి వాటిని వారికి ఇచ్చే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

పిల్ల‌ల‌కు కంటికి సంబంధించిన స‌మ‌స్య‌లు రాకుండా చేయ‌డంలో పొద్దు తిరుగుడు విత్త‌నాలు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిలో విట‌మిన్ ఇ తోపాటు జింక్ అధిక మొత్తంలో ఉంటుంది. పిల్లల్లో కంటిచూపును మెరుగుప‌ర‌చ‌డంలో న‌ల్ల ద్రాక్ష కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వీటిలోని యాంథో సైనిన్స్ కంటిచూపును మెరుగుప‌ర‌చ‌డంతోపాటు కంటిలోని రెటీనాను కూడా ర‌క్షిస్తాయి. కంటిచూపు స‌రిగా ఉండడంలో నీళ్లు కూడా ముఖ్య‌పాత్ర పోషిస్తాయి. పిల్ల‌లు వారి వ‌య‌స్సుకు త‌గిన‌ట్టు త‌గిన‌న్ని నీళ్లు తాగేలా చూసుకోవాలి. అలాగే పిల్ల‌లు ప్రతి రోజూ ఒక క్యారెట్ తినేలా చూసుకోవాలి.

ఈ ఆహార ప‌దార్థాల‌ను పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో కంటిచూపు మెరుగుప‌డ‌డ‌మే కాకుండా పోష‌కాహార లోపం కూడా రాకుండా ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల వారిలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి త‌ర‌చూ జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

Share
Sahithi

Recent Posts

OTT Horror Web Series : హార‌ర్ వెబ్‌సిరీస్‌ని తెలుగులోకి తీసుకొస్తున్న బాహుబ‌లి నిర్మాత‌లు.. స్ట్రీమింగ్ ఎందులో కానుంది అంటే..!

OTT Horror Web Series : ఇటీవ‌లి కాలంలో వెబ్ సిరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద నిర్మాత‌లు…

3 hours ago

OTT Suggestion : ఈ సినిమా చూడాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి.. లేకపోతే అంతే..!

OTT Suggestion : ఇటీవ‌లి కాలంలో హ‌ర‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. ప్ర‌తి సినిమా కూడా వైవిధ్య‌మైన కంటెంట్‌తో…

7 hours ago

Pawan Kalyan : అన్నాలెజినోవాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి విడాకులు.. పుకార్ల‌కి అలా పుల్‌స్టాప్ పెట్టిన ప‌వ‌న్..

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి…

14 hours ago

Vote Ink : ఓటు వేసాక వేలికి పెట్టే సిరా పోవాలి అంటే ఏం చేయాలి..?

Vote Ink : ఈ రోజు భారతదేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా…

1 day ago

Team India : క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల ఫాం.. ఇలా ఆడితే వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా గోవిందే..!

Team India : మ‌రి కొద్ది రోజుల‌లో వెస్టిండీస్, అమెరికా వేదిక‌గా టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నున్న విష‌యం తెలిసిందే.…

1 day ago

Bumrah Sunil Narine Wicket : సునీల్ న‌రైన్ వికెట్ తీసిన బుమ్రా.. సోష‌ల్ మీడియాలో న‌రైన్ పై ట్రోల్స్‌..

Bumrah Sunil Narine Wicket : ప్ర‌స్తుతం ఐపీఎల్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. బ్యాట‌ర్స్‌.. బౌల‌ర్స్‌ని టార్గెట్ చేసుకొని ఎడాపెడా…

2 days ago

Chandra Babu : చంద్ర‌బాబు ఆ ఒక్క‌దానిపైనే న‌మ్మకం పెట్టుకున్నారా.. అది నిల‌బెడుతుందా..?

Chandra Babu : ఏపీలో ఈ సారి రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది. వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుండ‌గా, టీడీపీ,…

2 days ago

YSRCP Vs TDP : ఎల్లో టీమ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్.. విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేసిన వైసీపీ..

YSRCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన…

2 days ago