ఈ చిట్కాలు పాటిస్తే.. ఇంట‌ర్వ్యూలో సుల‌భంగా స‌క్సెస్ అవుతారు.. జాబ్ మీదే అవుతుంది..!

డిగ్రీ చ‌దివి, అన్ని అర్హ‌త‌లు ఉన్నా స‌రే కొంద‌రు జాబ్ రాలేద‌ని నిరాశ చెందుతుంటారు. ఇక కొంద‌రు అయితే జాబ్ కోసం ఇంట‌ర్వ్యూల‌కు ఎలా హాజరు కావాలా.. అని సందేహిస్తుంటారు. అర్హ‌త‌లు ఉన్న‌ప్ప‌టికీ ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రు కావాలంటే కొంద‌రికి భ‌యంగా ఉంటుంది. దీంతో ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రు కాలేక‌.. జాబ్ పొంద‌లేక‌పోతుంటారు. అయితే అలాంటి వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే.. దాంతో ఎలాంటి భ‌యం లేకుండా ఇంట‌ర్వ్యూల్లో పాల్గొన‌వ‌చ్చు. ఈ చిట్కాల‌ను పాటిస్తే ఇంట‌ర్వ్యూల్లో సుల‌భంగా స‌క్సెస్ అవుతారు. దీంతో జాబ్ కూడా వ‌స్తుంది. ఇక అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట‌ర్వ్యూల‌లో కామ‌న్ గా అంద‌రినీ అడిగే ప్ర‌శ్న‌.. మీ గురించి మీరు చెప్పుకోమని అంటారు. ఇలా ప్ర‌శ్న వేస్తే ఎలాంటి తొంద‌ర పాటు అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. వారు అడుగుతుంది, మీ గురించే క‌దా. మీ గురించి మీకు కాక‌పోతే ఎవ‌రికి తెలుస్తుంది. క‌నుక మీ గురించి మీకు తెలిసిన విష‌యాల‌ను చాలా కాన్ఫిడెంట్‌గా ఇంట‌ర్వ్యూయ‌ర్ల‌కు చెప్పేయండి. దీంతో మీపై వారికి న‌మ్మ‌కం వ‌స్తుంది. పెద్ద‌గా ప్ర‌శ్న‌లు వేయ‌కుంగానే ఇంట‌ర్వ్యూను ముగించేందుకు ఇది తోడ్ప‌డుతుంది. క‌నుక మీ గురించి చెప్ప‌మ‌న్న‌ప్పుడు దానిపై మీరు కాన్ఫిడెంట్ గా చెప్పేందుకు య‌త్నించండి. జాబ్ మీదే అవుతుంది.

follow these tips to get success in job interviews

ఇంట‌ర్వ్యూ అంటే అందులో మీరు ఒక్క‌రే కాదు, మీలా చాలా మంది అటెండ్ అవుతారు క‌దా. క‌నుక వారంద‌రినీ హెచ్ఆర్ ఇంట‌ర్వ్యూ చేస్తూ పోతే హెచ్ఆర్‌కు హెడేక్ వ‌స్తుంది. వారు విసుగు చెందుతారు. క‌నుక మీ వంతు వ‌చ్చిన‌ప్పుడు మీరు ప్ర‌వర్తించే ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల వారు విసుగు చెందే అవ‌కాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే.. వారిని మీరు వీలైనంత వ‌ర‌కు ప్ర‌శాంతంగా ఉండేందుకు య‌త్నించండి. దీంతో వారికి మీపై మంచి ఇంప్రెష‌న్ ఏర్ప‌డుతుంది. మీరు ఎలాంటి క‌ఠిన‌త‌ర ప‌రిస్థితిలో అయినా వ‌ర్క్ చేయ‌గ‌ల‌రు అని ఇంట‌ర్వ్యూయ‌ర్లు తెలుసుకుంటారు. దీంతో జాబ్ మీ సొంత‌మ‌వుతుంది.

జాబ్ ఇంట‌ర్వ్యూల‌లో వీలైనంత వ‌ర‌కు మిమ్మ‌ల్ని అడిగే ప్ర‌శ్న‌ల‌కు సింపుల్‌గా స‌మాధానాలు చెప్పండి. పెద్ద పెద్ద వాక్యాలు వాడ‌కండి. క్లిష్ట‌త‌ర‌మైన‌, అర్థం చేసుకోలేని ప‌దాల‌ను వాడ‌కండి. అలా వాడితే హెచ్ఆర్‌కు మీపై విసుగు పుట్టి మీ జాబ్ అప్లికేష‌న్‌ను రిజెక్ట్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక సింపుల్‌గా ఆన్స‌ర్లు చెప్పే ప్ర‌య‌త్నం చేయండి.

మీ గురించి మీరు చెప్పేట‌ప్పుడు మ‌రీ అవ‌స‌రం లేని విష‌యాలు చెప్ప‌కండి. జాబ్‌కు సంబంధం ఉన్న‌వి, అందుకు గాను మీకున్న నైపుణ్యాల‌ను మాత్రం చెబితే చాలు. అలా కాకుండా ఎక్కువ‌గా చెబితే మీరే చిక్కుల్లో ప‌డ‌తారు. మీరు జాబ్ చేయాల‌నుకున్న కంపెనీ గోల్స్ గురించి ముందే తెలుసుకోండి. వాటి గురించి మీరు ప్రాక్టీస్ చేయండి. అవే మీ గోల్స్‌గా నిర్ణ‌యించుకోండి. వాటిని ఇంట‌ర్వ్యూలో మీ గోల్స్‌గా చెప్పండి. అంతే.. ఇంట‌ర్వ్యూయ‌ర్లు ఫ్లాట్ అవుతారు. మీకు జాబ్ గ్యారంటీగా వ‌స్తుంది.

ఇంట‌ర్వ్యూయ‌ర్లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధానాలు చెప్పండి. విసుగు చెంద‌కండి. కోపం ప్ర‌ద‌ర్శించ‌కండి. అలా చేస్తే మీ జాబ్ అప్లికేష‌న్ రిజెక్ట్ అవుతుంది. మీరు జాబ్ కోసం వ‌చ్చిన కంపెనీలో మీకు వ‌ర్క్ అంటే ఎంత ఇష్ట‌మో ఇంట‌ర్వ్యూయ‌ర్ల‌కు చెప్పండి. దీంతో వారు ఇంప్రెస్ అవుతారు. మీకు జాబ్ ఇస్తారు. ఏ విష‌యంపైనైనా అతిగా చెప్ప‌కండి. ఇంట‌ర్వ్యూయ‌ర్లు అడిగిన ప్ర‌శ్న‌ల మేర‌కు, అవ‌స‌రం ఉన్నంత వ‌ర‌కే స‌మాధానం చెప్పండి. అతిగా స‌మాధానాలు చెబితే మీపై బ్యాడ్ ఇంప్రెష‌న్ ఏర్ప‌డుతుంది. అది జాబ్ ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. క‌నుక ఇంట‌ర్వ్యూల్లో ఈ విధంగా చిట్కాల‌ను పాటిస్తే జాబ్‌ను సుల‌భంగా పొంద‌గ‌లుగుతారు.

Share
editor

Recent Posts

OTT Suggestion : ఈ సినిమా చూడాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి.. లేకపోతే అంతే..!

OTT Suggestion : ఇటీవ‌లి కాలంలో హ‌ర‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. ప్ర‌తి సినిమా కూడా వైవిధ్య‌మైన కంటెంట్‌తో…

3 hours ago

Pawan Kalyan : అన్నాలెజినోవాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి విడాకులు.. పుకార్ల‌కి అలా పుల్‌స్టాప్ పెట్టిన ప‌వ‌న్..

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి…

10 hours ago

Vote Ink : ఓటు వేసాక వేలికి పెట్టే సిరా పోవాలి అంటే ఏం చేయాలి..?

Vote Ink : ఈ రోజు భారతదేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా…

23 hours ago

Team India : క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల ఫాం.. ఇలా ఆడితే వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా గోవిందే..!

Team India : మ‌రి కొద్ది రోజుల‌లో వెస్టిండీస్, అమెరికా వేదిక‌గా టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నున్న విష‌యం తెలిసిందే.…

1 day ago

Bumrah Sunil Narine Wicket : సునీల్ న‌రైన్ వికెట్ తీసిన బుమ్రా.. సోష‌ల్ మీడియాలో న‌రైన్ పై ట్రోల్స్‌..

Bumrah Sunil Narine Wicket : ప్ర‌స్తుతం ఐపీఎల్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. బ్యాట‌ర్స్‌.. బౌల‌ర్స్‌ని టార్గెట్ చేసుకొని ఎడాపెడా…

1 day ago

Chandra Babu : చంద్ర‌బాబు ఆ ఒక్క‌దానిపైనే న‌మ్మకం పెట్టుకున్నారా.. అది నిల‌బెడుతుందా..?

Chandra Babu : ఏపీలో ఈ సారి రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది. వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుండ‌గా, టీడీపీ,…

2 days ago

YSRCP Vs TDP : ఎల్లో టీమ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్.. విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేసిన వైసీపీ..

YSRCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన…

2 days ago

Kirak RP : రోజాని ఓ రేంజ్‌లో చెడుగుడు ఆడిన కిరాక్ ఆర్పీ.. ఫస్ట్ ఓడిపోయేది మా యువరాణే..!

Kirak RP : ఏపీ ఎన్నిక‌లు సమీపిస్తున్న స‌మ‌యంలో ప్ర‌చారాలు కూడా ఊపందుకుంటున్నాయి. ప‌లు ప్రాంతాల‌లో సంచరిస్తూ జోరుగా ప్ర‌చారాలు…

2 days ago