రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

మనం ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో క్యారెట్ కూడా ఒక‌టి. ఇది మ‌నందరికీ సుప‌రిచిత‌మే. మ‌నం వంట‌ల్లో త‌రుచూ క్యారెట్ ను వాడుతూ ఉంటాం. అలాగే కొంద‌రూ దీనిని నేరుగా కూడా తింటూ ఉంటారు. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా క్యారెట్ ను జ్యూస్ గా కూడా చేసుకుని తాగ‌వ‌చ్చు. రోజూ క్యారెట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ జ్యూస్ ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్ ల‌లో బీటా కెరోటిన్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది శ‌రీరంలోకి వెళ్లిన త‌రువాత విట‌మిన్ ఎ గా మారుతుంది. క్యారెట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు త‌గినంత విట‌మిన్ ఎ ల‌భించి క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా క్యారెట్ లో కెరోటినాయిడ్లు అధికంగా ఉంటాయి. క్యారెట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల వీటిలో ఉండే కెరోటినాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్లుగా ప‌నిచేసి శ‌రీరంలోని మ‌లినాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంతోపాటు శ‌రీరానికి హాని చేసే ఫ్రీ రాడిక‌ల్స్‌తో పోరాడి అవి న‌శించేలా చేస్తాయి. క్యారెట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గి మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. శ‌రీరంలో జీవ‌క్రియ‌లు సాఫీగా సాగుతాయి.

drink one glass of carrot juice everyday for these benefits

క్యారెట్ జ్యూస్ ను రోజూ తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. చ‌ర్మం పై ముడ‌త‌లు త‌గ్గి, ముఖం కాంతివంతంగా త‌యార‌య్యేలా చేయడంలో కూడా క్యారెట్ జ్యూస్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు రోజూ క్యారెట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. అధిక ర‌క్త‌పోటు, థైరాయిడ్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు క్యారెట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుందని, క్యారెట్ జ్యూస్ ను త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా చేసుకోవాల‌ని.. నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Share
editor

Recent Posts

Monica Siva : కార్తీ ఖైదీ మూవీలోని చిన్నారి ఎంత పెద్ద‌గా ఉంది.. ఆమె అందానికి ఫిదా కావ‌ల్సిందే..!

Monica Siva : ఇండియన్ సినిమాల్లో కొన్ని చిత్రాలు ప్రేక్ష‌కుల‌కి మంచి ఆస‌క్తిని క‌లిగిస్తాయి. ఆ సినిమాలు మంచి మ‌జాతో…

12 hours ago

OTT Suggestion : న‌రాలు తెగే ఉత్కంఠ‌.. ప‌ది నిమిషాల‌కొక ట్విస్ట్‌తో ఆస‌క్తి రేపుతున్న థ్రిల్ల‌ర్ మూవీ..

OTT Suggestion : ఇటీవ‌లి కాలంలో థ్రిల్ల‌ర్ మూవీస్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఎంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాయో మ‌నం చూస్తున్నాం.…

15 hours ago

CM YS Jagan : వైసీపీ మైండ్ గేమ్‌తో టీడీపీ కుదేలు.. కూట‌మికి చెక్ పెడ‌తారా..!

CM YS Jagan : ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయం చాలా రంజుగా సాగుతుంది. ఈ సారి ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారా…

21 hours ago

Aisha Sharma : అక్కా చెల్లెళ్లు ఇద్ద‌రూ అందాల‌ను చూపించ‌డంలో పోటీ ప‌డుతున్నారుగా..!

Aisha Sharma : చిరుత బ్యూటీ నేహా శ‌ర్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. రామ్ చ‌రణ్‌తో తెగ రొమాన్స్…

1 day ago

Nagababu : బ‌న్నీ ఆర్మీకి నాగ‌బాబుకి త‌లొగ్గక త‌ప్ప‌లేదా.. ట్విట్ట‌ర్ నుండి ఔట్..!

Nagababu : మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే" అంటూ కొణిదెల నాగబాబు…

2 days ago

Krishnamma OTT : రిలీజ్ అయిన వారం రోజుల‌కే ఓటీటీలోకి కృష్ణ‌మ్మ‌.. ఎక్క‌డ చూడొచ్చు అంటే..!

Krishnamma OTT : ఒక‌ప్పుడు థియేట‌ర్స్‌లో రిలీజైన సినిమా ఓటీటీలోకి రావ‌డానికి క‌నీసం 3 నెల‌లు అయిన సమ‌యం ప‌ట్టేది.…

2 days ago

Ashu Reddy : బ్లూ కలర్ లాంగ్ డ్రెస్‌లో మ‌త్తెక్కిస్తున్న జూనియ‌ర్ స‌మంత‌.. పోజులు మాములుగా లేవు..!

Ashu Reddy : జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి గురించి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ భామ…

2 days ago

Shiksha Das : ఐపీఎల్‌లో హీటు పెంచుతున్న బెంగాలీ బ్యూటీ.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ..?

Shiksha Das : ఐపీఎల్ టోర్నమెంట్ ప్ర‌తి ఒక్క‌రికి మంచి మ‌జాని అందిస్తుంటుంది. క్రికెట్ ప్రియులు, హీరోయిన్స్,ప‌లువురు స్టార్స్ కూడా…

2 days ago