చిరంజీవి, ఆర్జీవీ కాంబినేషన్‌లో ప్రారంభమైన సినిమాకు మధ్యలోనే బ్రేక్ పడడానికి కారణం ఎవరో తెలుసా..?

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయినా ద‌ర్శ‌కుడు ఆర్జీవీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న త‌న‌కు న‌చ్చిందే చేస్తూ.. న‌చ్చిన‌ట్టు బ్రతికేవారిలో ముందు వరుసలో ఉంటాడు. ఇక కొంత‌కాలంగా ఆర్జీవీ డైరెక్ట్ సినిమాలు వ‌రుస ప్లాప్స్ గా నిలుస్తున్నాయి. అయినా కానీ ఆయ‌న క్రేజ్ ఏమాత్రం తగ్గటం లేదు. త‌న సినిమాలు ఫ్లాప్ అవ్వ‌డానికి మెయిన్ రీజన్.. తాన‌కు న‌చ్చిన‌ట్టు సినిమా తీయ‌డ‌మే అని, న‌చ్చిన‌వాళ్లు చూడొచ్చ‌ని లేదంటే లేద‌ని కూడా ఆర్జీవి మొహ‌మాటం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు.

ఒకప్పటి కాలంలో ఆర్జీవి అంటే సినిమాల సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు. 1990 దశాబ్దంలో ఆర్జీవీతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సైతం క్యూ కట్టేవారు. 1989లో నాగార్జునతో శివ సినిమా తీసి ఆర్జీవీ డైరెక్టర్ గా తనకంటూ ఒక సెపరేట్  ట్రెండ్ ను సెట్ చేశారు. అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా స‌ర్కార్ లాంటి సినిమా చేసి తన స‌త్తా చాటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్జీవీ కెరీర్ లో డిజాస్ట‌ర్ ల‌తో పాటూ ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ లు కూడా ఉన్నాయి.

ram gopal varma and chiranjeevi movie stopped why

ఈ విషయం ఇలా ఉండగా రామ్ గోపాల్ వ‌ర్మ శివ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న త‌ర‌వాత వెంక‌టేశ్, చిరంజీవి ల‌తో సినిమాలు చేయాల‌ని నిర్నయించుకున్నాడట. ఆర్జీవీతో కలిసి ఈ సినిమా చేసేందుకు వైజ‌యంతీ మూవీస్ ముందుకు వ‌చ్చింది. వ‌ర్మ స్క్రిప్ట్ సిద్దం చేసి చిరంజీవికి కథ వినిపించడం జరిగింది.  చిరంజీవి క‌థ‌ మొత్తం విని  కొన్ని మార్పులు చేయాలని సూచించారట. కానీ రామ్ గోపాల్ వ‌ర్మ అందుకు నిరాక‌రించాడు. అంతే కాకుండా స్క్రిప్ట్ విష‌యంలో వేళ్లు పెడితే తాను సినిమా నుండి తప్పుకుంటాన‌ని వ‌ర్మ నిర్మొహమాటంగా చెప్పేశాడు.

కానీ అప్ప‌టికే ఈ సినిమా కోసం రెండు పాట‌ల‌ను కూడా సిద్ధం చేయటం జరిగింది. కానీ చివ‌రికి ఆర్జీవి తను ముందుగానే చెప్పిన‌ట్టుగా సినిమా నుండి త‌ప్పుకున్నాడు. దాంతో అప్ప‌టికే రూపొందించిన రెండు పాట‌ల‌ను వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మించిన చూడాల‌ని ఉంది సినిమాలో ఉపయోగించుకున్నారు. అలా ఆర్జీవీ, చిరంజీవి కాంబినేష‌న్ లో రావాల్సిన సినిమా చిరంజీవి కథ విషయంలో జోక్యం చేసుకోవడంతో మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

Share
Mounika Yandrapu

Recent Posts

OTT Horror Web Series : హార‌ర్ వెబ్‌సిరీస్‌ని తెలుగులోకి తీసుకొస్తున్న బాహుబ‌లి నిర్మాత‌లు.. స్ట్రీమింగ్ ఎందులో కానుంది అంటే..!

OTT Horror Web Series : ఇటీవ‌లి కాలంలో వెబ్ సిరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద నిర్మాత‌లు…

14 hours ago

OTT Suggestion : ఈ సినిమా చూడాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి.. లేకపోతే అంతే..!

OTT Suggestion : ఇటీవ‌లి కాలంలో హ‌ర‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. ప్ర‌తి సినిమా కూడా వైవిధ్య‌మైన కంటెంట్‌తో…

19 hours ago

Pawan Kalyan : అన్నాలెజినోవాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి విడాకులు.. పుకార్ల‌కి అలా పుల్‌స్టాప్ పెట్టిన ప‌వ‌న్..

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి…

1 day ago

Vote Ink : ఓటు వేసాక వేలికి పెట్టే సిరా పోవాలి అంటే ఏం చేయాలి..?

Vote Ink : ఈ రోజు భారతదేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా…

2 days ago

Team India : క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల ఫాం.. ఇలా ఆడితే వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా గోవిందే..!

Team India : మ‌రి కొద్ది రోజుల‌లో వెస్టిండీస్, అమెరికా వేదిక‌గా టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నున్న విష‌యం తెలిసిందే.…

2 days ago

Bumrah Sunil Narine Wicket : సునీల్ న‌రైన్ వికెట్ తీసిన బుమ్రా.. సోష‌ల్ మీడియాలో న‌రైన్ పై ట్రోల్స్‌..

Bumrah Sunil Narine Wicket : ప్ర‌స్తుతం ఐపీఎల్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. బ్యాట‌ర్స్‌.. బౌల‌ర్స్‌ని టార్గెట్ చేసుకొని ఎడాపెడా…

2 days ago

Chandra Babu : చంద్ర‌బాబు ఆ ఒక్క‌దానిపైనే న‌మ్మకం పెట్టుకున్నారా.. అది నిల‌బెడుతుందా..?

Chandra Babu : ఏపీలో ఈ సారి రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది. వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుండ‌గా, టీడీపీ,…

3 days ago

YSRCP Vs TDP : ఎల్లో టీమ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్.. విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేసిన వైసీపీ..

YSRCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన…

3 days ago