Krishnam Raju : కృష్ణం రాజు చ‌నిపోయింది అందుకే.. ఆ కార‌ణాల వ‌ల్లే ఆయ‌న క‌న్నుమూశారు..

Krishnam Raju : తెలుగు తెర‌పై చెర‌గ‌ని ముద్ర వేసుకున్న న‌టుడు కృష్ణం రాజు. హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా కృష్ణం రాజు న‌టించి మెప్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు చికిత్స పొందుతూ కన్నుమూశారు. 83 ఏళ్ల కృష్ణంరాజు మరణవార్త విని టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. నటనతోనే కాదు, డైలాగ్ డెలివరీతో కూడా కృష్ణం రాజు ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. మొదట్లో నెగెటివ్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన కృష్ణంరాజు ఆ తరువాత హీరోగా మెరిశారు.

ఆదివారం తెల్ల‌వారుజామున కృష్ణం రాజు కన్నుమూయగా, ఆయ‌న మృతికి సంబంధించి వైద్యులు ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో గతేడాది కృష్ణంరాజు కాలుకు సర్జరీ జరిగిందని చెప్పారు. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడుతున్నట్టుగా తెలిపారు. ఆగస్టు 5వ తేదీన పోస్టు కోవిడ్ సమస్యలతో కృష్ణంరాజు ఏఐజీ ఆస్పత్రిలో చేరినట్టుగా వెల్లడించారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర న్యుమోనియా ఉన్నట్లు గుర్తించామని వైద్యులు పేర్కొన్నారు.

Krishnam Raju died because of this reasons
Krishnam Raju

కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కృష్ణంరాజుకు వెంటిలేటర్‌‌పై చికిత్స అందించినట్టుగా వైద్యులు స్ప‌ష్టం చేశారు. ఆదివారం తెల్ల‌వారుజామున హార్ట్ స్ట్రోక్ రావ‌డంతో ఆయ‌న క‌న్నుమూసిన‌ట్టు తెలియ‌జేశారు. కాగా కృష్ణం రాజు.. కృష్ణవేణి, భక్త కన్నప్ప, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, పల్నాటి పౌరుషం వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. కృష్ణం రాజు మరణవార్తతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సోమ‌వారం ఉద‌యం కృష్ణం రాజు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

RK Roja : మ‌ళ్లీ యాక్టివ్ అయిన రోజా.. జ‌గ‌న్ సంస్క‌ర‌ణ‌లే గ‌ట్టెక్కిస్తాయంటూ కామెంట్..

RK Roja : ఏపీలో దారుణాతి దారుణంగా ఓడిన త‌ర్వాత రోజా మ‌ళ్లీ క‌నిపించింది లేదు. ఆమె సోష‌ల్ మీడియాకి…

10 hours ago

Actor Nani : అంద‌రి క‌డుపు చెక్క‌ల‌య్యేలా సినిమా తీస్తాం అంటూ నాని కామెంట్స్‌

Actor Nani : నేచుర‌ల్ స్టార్ నాని వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అలరిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఆయ‌న రీసెంట్‌గా సరిపోదా…

17 hours ago

World Cup Ganesha : వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీతో బొజ్జ గ‌ణ‌ప‌య్య‌.. ప‌క్క‌నే రోహిత్ శ‌ర్మ‌..

World Cup Ganesha : వినాయ‌క చ‌వితి వేడుకని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకుంటారు. రేపు వినాయ‌క…

21 hours ago

Rohit Sharma : గ్యాప్‌ని స‌ద్వినియోగం చేసుకుంటున్న రోహిత్ శ‌ర్మ‌.. జిమ్‌లో హార్డ్ వ‌ర్క్ మాములుగా లేదు..!

Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఈ మ‌ధ్య టీ20ల‌కి గుడ్ బై చెప్పి ప్ర‌స్తుతం వన్డే,…

1 day ago

Simba First Look : అక్క నిర్మాణంలో బాల‌య్య త‌నయుడి చిత్రం.. ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసిందిగా..!

Simba First Look : చాలాకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలు, నంద‌మూరి అభిమానులు ఎంతో ఆస‌క్తిగా మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం…

2 days ago

Sonu Sood : తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి అండ‌గా సోనూసూద్.. వరద బాధితులకు నేనున్నానంటూ భరోసా..

Sonu Sood : భారీ వర్షాలు, వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరదల కారణంగా భారీ ఆర్థిక నష్టం…

2 days ago

Pawan Kalyan : వైసీపీ నాయ‌కుల‌కి ప‌వ‌న్ హెచ్చ‌రిక.. నీతులు చెప్ప‌డం కాదు, నాతో పాటు రండి చూపిస్తా..!

Pawan Kalyan : ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌జ‌లు వ‌ర‌ద‌ల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.ఇదే స‌మ‌యంలో కొంద‌రు చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నారు.…

2 days ago

Samantha : షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ స‌మంత‌.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్..

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత విడాకుల త‌ర్వాత త‌న ఫోక‌స్ మొత్తం సినిమాల‌పైనే పెట్టింది. వెబ్ సిరీస్…

3 days ago