స్విగ్గీ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్.. ఇక‌పై ఇంటి నుంచే ప‌ని..!

క‌రోనా నేప‌థ్యంలో ఇప్ప‌టికే అనేక కంపెనీల‌కు చెందిన ఉద్యోగులు ఇంటి నుంచే ప‌నిచేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం లేక‌పోయేస‌రికి ఆఫీసుల‌కు రావాల‌ని కంపెనీలు ఉద్యోగుల‌ను బ‌తిమాలుతున్నాయి. కానీ త‌మ‌కు జీతం త‌క్కువ ఇచ్చినా స‌రే ఆఫీస్‌కు రామ‌ని చెబుతున్నారు. అంత‌గా ఒత్తిడి చేస్తే ఉద్యోగం వ‌దిలేస్తామ‌ని చెబుతున్నారు. దీంతో కంపెనీలు నెత్తి నోరు కొట్టుకుంటున్నాయి. అయితే స్విగ్గీ మాత్రం ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఇచ్చేందుకే మొగ్గు చూపింది. ఈ కంపెనీలోని ఉద్యోగులు ఇక‌పై ఇంటి నుంచే ప‌నిచేయ‌వ‌చ్చు.

స్విగ్గీ ప్ర‌వేశ‌పెట్టిన కొత్త పాల‌సీ ప్ర‌కారం.. ఆ కంపెనీలో ప‌నిచేస్తున్న కార్పొరేట్‌, సెంట్ర‌ల్ బిజినెస్‌, ఫంక్ష‌న్స్, టెక్నాల‌జీ విభాగాల‌కు చెందిన సిబ్బంది ఇక‌పై ఇంటి నుంచే ప‌నిచేయ‌వ‌చ్చు. అయితే ఉద్యోగులు సీనియ‌ర్లు అయి ఉండాలి. కొత్త‌గా చేరే వారికి ఈ అవ‌కాశం లేదు. అలాగే ప్ర‌తి 3 నెల‌ల‌కు ఒక‌సారి మాత్రం ఇలా అవ‌కాశం క‌ల్పిస్తారు. 3 నెల‌ల‌కు ఒక‌సారి వారం రోజుల పాటు ఉద్యోగులు తాము ఎంచుకుకున్న ప్ర‌దేశంలో ఉండి ప‌నిచేయ‌వ‌చ్చు. ఆఫీస్‌కు రావాల్సిన ప‌నిలేదు.

Swiggy gives work from home for its employees

ఇక పార్ట్‌న‌ర్ ఫేసింగ్ రోల్స్‌లో ప‌నిచేసేవారు మాత్రం త‌ప్ప‌నిస‌రిగా ఆఫీస్‌కు రావ‌ల్సి ఉంటుంద‌ని స్విగ్గీ తెలియ‌జేసింది. అయితే ఎంతో మంది మేనేజ‌ర్లు, ఉద్యోగుల నుంచి ఫీడ్‌బ్యాక్ పొందిన త‌రువాత‌నే ఉత్పాద‌క‌త పెరుగుతుంద‌న్న ఉద్దేశంతో తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స్విగ్గీకి చెందిన ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇలా ఇప్ప‌టికే అనేక కంపెనీలు స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నాయని.. క‌నుక తాము కూడా ఈ నూత‌న మోడ‌ల్‌ను అమ‌లు చేసి ఫ‌లితాల‌ను విశ్లేషిస్తామ‌ని.. బాగుంటే దీన్ని మ‌రింత విస్త‌రిస్తామ‌ని తెలిపారు.

కాగా దేశ‌వ్యాప్తంగా స్విగ్గీ సేవ‌లు ప్ర‌స్తుతం 487 న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ల‌భిస్తుండ‌గా.. 27 రాష్ట్రాల్లో స్విగ్గీ ఉనికిలో ఉంది. ఈ క్ర‌మంలోనే 2020 నుంచే స్విగ్గీ ఉద్యోగుల‌కు మ‌రింత సుల‌భంగా ప‌నిచేసే స‌దుపాయాల‌ను కల్పించే పాల‌సీని ప్ర‌వేశ‌పెట్టింది. అప్ప‌టి నుంచి దానికి మార్పులు చేర్పులు చేస్తూ వ‌స్తోంది. అందులో భాగంగానే తాజాగా ఈ కొత్త పాల‌సీని ప్ర‌క‌టించారు. దీంతో 3 నెల‌ల‌కు ఒక‌సారి ఉద్యోగులు 7 రోజుల పాటు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేయ‌వ‌చ్చు. అయితే ఈ పాల‌సీ వ‌ల్ల ఫ‌లితాలు ఎలా వ‌స్తాయోన‌ని స్విగ్గీ ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది.

Share
editor

Recent Posts

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

Torn Currency Notes : చాలా మంది ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన కరెన్సీ నోట్లు ఉంటాయి. అవి…

4 hours ago

OTT Horror Web Series : హార‌ర్ వెబ్‌సిరీస్‌ని తెలుగులోకి తీసుకొస్తున్న బాహుబ‌లి నిర్మాత‌లు.. స్ట్రీమింగ్ ఎందులో కానుంది అంటే..!

OTT Horror Web Series : ఇటీవ‌లి కాలంలో వెబ్ సిరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద నిర్మాత‌లు…

19 hours ago

OTT Suggestion : ఈ సినిమా చూడాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి.. లేకపోతే అంతే..!

OTT Suggestion : ఇటీవ‌లి కాలంలో హ‌ర‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. ప్ర‌తి సినిమా కూడా వైవిధ్య‌మైన కంటెంట్‌తో…

24 hours ago

Pawan Kalyan : అన్నాలెజినోవాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి విడాకులు.. పుకార్ల‌కి అలా పుల్‌స్టాప్ పెట్టిన ప‌వ‌న్..

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి…

1 day ago

Vote Ink : ఓటు వేసాక వేలికి పెట్టే సిరా పోవాలి అంటే ఏం చేయాలి..?

Vote Ink : ఈ రోజు భారతదేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా…

2 days ago

Team India : క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల ఫాం.. ఇలా ఆడితే వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా గోవిందే..!

Team India : మ‌రి కొద్ది రోజుల‌లో వెస్టిండీస్, అమెరికా వేదిక‌గా టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నున్న విష‌యం తెలిసిందే.…

2 days ago

Bumrah Sunil Narine Wicket : సునీల్ న‌రైన్ వికెట్ తీసిన బుమ్రా.. సోష‌ల్ మీడియాలో న‌రైన్ పై ట్రోల్స్‌..

Bumrah Sunil Narine Wicket : ప్ర‌స్తుతం ఐపీఎల్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. బ్యాట‌ర్స్‌.. బౌల‌ర్స్‌ని టార్గెట్ చేసుకొని ఎడాపెడా…

2 days ago

Chandra Babu : చంద్ర‌బాబు ఆ ఒక్క‌దానిపైనే న‌మ్మకం పెట్టుకున్నారా.. అది నిల‌బెడుతుందా..?

Chandra Babu : ఏపీలో ఈ సారి రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది. వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుండ‌గా, టీడీపీ,…

3 days ago