Chicken Sales : చికెన్ అమ్మ‌కాలు బంద్‌..? ఎందుకు..?

Chicken Sales : ఈ రోజుల్లో ముక్క తగ‌ల‌నిది మందు దిగ‌డం లేదు. అయితే చికెన్‌కి సంబంధించి ప‌లు వెరైటీలు ఆర‌గించ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వదిలిపోయిందన్ని ఈ వైరస్ రక్కసి మళ్లీ జన సంచారంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా జార్ఖండ్‌లో సైతం బర్డ్ ఫ్లూ కేసులు విజృంభించాయి. రాష్ట్ర రాజధాని రాంచీలోనే అత్యధికంగా కేసులు నమోదుకావడంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. హోత్వార్ ప్రాంతంలోని రీజనల్ పౌల్ట్రీ ఫామ్‌లో 2,196 పక్షులతో పాటు 1,745 కోళ్లు మృత్యువాతపడ్డాయి. అనుమానిత 1,697 గుడ్లను అధికారులు పగలగొట్టారు. భోపాల్‌లోని ఓ ల్యాబొరేటరీలో కోళ్ల నమూనాలను పరీక్షించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా H5N1 నమూనాలో వైరస్ నిర్ధారణ అయింది.

ఈ వైరస్ వల్ల పక్షులు బర్డ్ ఫ్లూ బారిన ప‌డుతుండ‌డంతో చాలా కోళ్లు అనారోగ్యానికి గురై మృతి చెందుతున్నాయి. వైరస్ వేరే జీవులకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. వ్యాధి సోకిన కోళ్లను తింటే ప్రాణాలకే ప్రమాదం. బర్డ్ ఫ్లూ కేసులు బయటపడగానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయిన ప్రాంతం నుంచి కిలోమీటరు పరిధిలో కోళ్లు, వాటికి సంబంధించిన ఉత్పత్తులు, గుడ్ల కొనుగోలు, అమ్మకం, రవాణాపై తక్షణమే నిషేధం విధించారు. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ప్రభావిత ప్రాంతాల్లో నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. రాంచీ డిప్యూటీ కమిషనర్ రాహుల్ కుమార్ సిన్హా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో వెటర్నరీ అధికారులు, సిబ్బందిని నియమించారు.

Chicken Sales reportedly going down what are the reasons
Chicken Sales

వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. పౌల్ట్రీ ఫామ్‌లోని మిగిలిన కోళ్లను చంపి, పారవేసి ఆపై వైరస్ సోకిన ప్రాంతాన్ని క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలని సూచించింది. వ్యాప్తి చెందే ప్రదేశం చుట్టూ ఒక కి.మీ వ్యాసార్థాన్ని ఇన్‌ఫెక్షన్ ఉన్న ప్రాంతంగా గుర్తించాలని, దాని చుట్టూ పది కి.మీ వ్యాసార్థాన్ని నిఘా జోన్‌గా గుర్తించాలని అధికారులకు సూచించారు. అయితే వ్యాధి వ్యాపించిన పౌల్ట్రీ ఫామ్‌కి 3 నెలల క్రితమే అనుమతులు లభించినట్లు అధికారులు తెలిపారు. ఏవైనా పక్షులు అనుమానాస్పదంగా మృతి చెంది ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని పశుసంవర్ధక శాఖ ప్రజలకు సూచించింది.

Share
Shreyan Ch

Recent Posts

Vote Ink : ఓటు వేసాక వేలికి పెట్టే సిరా పోవాలి అంటే ఏం చేయాలి..?

Vote Ink : ఈ రోజు భారతదేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా…

11 hours ago

Team India : క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల ఫాం.. ఇలా ఆడితే వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా గోవిందే..!

Team India : మ‌రి కొద్ది రోజుల‌లో వెస్టిండీస్, అమెరికా వేదిక‌గా టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నున్న విష‌యం తెలిసిందే.…

15 hours ago

Bumrah Sunil Narine Wicket : సునీల్ న‌రైన్ వికెట్ తీసిన బుమ్రా.. సోష‌ల్ మీడియాలో న‌రైన్ పై ట్రోల్స్‌..

Bumrah Sunil Narine Wicket : ప్ర‌స్తుతం ఐపీఎల్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. బ్యాట‌ర్స్‌.. బౌల‌ర్స్‌ని టార్గెట్ చేసుకొని ఎడాపెడా…

23 hours ago

Chandra Babu : చంద్ర‌బాబు ఆ ఒక్క‌దానిపైనే న‌మ్మకం పెట్టుకున్నారా.. అది నిల‌బెడుతుందా..?

Chandra Babu : ఏపీలో ఈ సారి రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది. వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుండ‌గా, టీడీపీ,…

2 days ago

YSRCP Vs TDP : ఎల్లో టీమ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్.. విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేసిన వైసీపీ..

YSRCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన…

2 days ago

Kirak RP : రోజాని ఓ రేంజ్‌లో చెడుగుడు ఆడిన కిరాక్ ఆర్పీ.. ఫస్ట్ ఓడిపోయేది మా యువరాణే..!

Kirak RP : ఏపీ ఎన్నిక‌లు సమీపిస్తున్న స‌మ‌యంలో ప్ర‌చారాలు కూడా ఊపందుకుంటున్నాయి. ప‌లు ప్రాంతాల‌లో సంచరిస్తూ జోరుగా ప్ర‌చారాలు…

2 days ago

Allu Arjun BMW Car : అల్లు అర్జున్ కొత్త బీఎండ‌బ్ల్యూ కారు ధ‌ర తెలిస్తే వ‌ణుకు పుడ‌త‌ది..!

Allu Arjun BMW Car : గంగోత్రితో తొలిసారిగా ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించి ఆర్య‌లో కాలేజ్ కుర్రాడిలా అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొట్టిన…

3 days ago

CM YS Jagan : ఏంటి.. జ‌గ‌న్‌కి ఫోన్ లేదా.. ప్ర‌త్యేక నెంబ‌ర్ కూడా లేదా..?

CM YS Jagan : ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో చాలా బిజీగా ఉన్నారు. అనేక…

3 days ago