GPay PhonePe: గూగుల్ పే, ఫోన్ పేలో పొర‌పాటున ఇత‌రుల‌కు డ‌బ్బు పంపారా.. అయితే ఇలా చేయండి..!

GPay PhonePe: యూపీఐ (Unified Payment Interface-UPI) గురించి ఈ రోజుల్లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. చెల్లింపులకు సంబంధించిన ఈ లావాదేవీ ప్రక్రియను ఈ రోజుల్లో ఎక్కువగా వాడుతున్నారు. ఇది ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులకు అనుమతినిస్తుంది. మొబైల్ ఫోన్ లోని యాప్ ద్వారా ఈ పేమెంట్స్ చేయవచ్చు. UPI ద్వారా డబ్బును 24X7 బదిలీ చేసుకునే సదుపాయముంది. ఈ క్రమంలో చెల్లింపు సమయంలో చేసే చిన్న పొరపాట్ల వల్ల తప్పుడు వ్యక్తుల బ్యాంక్ ఖాతాలకు డబ్బు పంపే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భంలో ఆ డబ్బును ఎలా రికవర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.

హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించండి: మీరు UPI చెల్లింపుల సమయంలో తప్పుడు ఖాతాకు డబ్బు ట్రాన్ఫర్ చేసినట్లయితే భయపడాల్సిన పనిలేదు. తప్పు లావాదేవీ జరిగితే, ముందుగా దాని వివరాలతో కూడిన స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ పేమెంట్ మెసేజ్ లో ఉన్న హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి రిపోర్ట్ చేయండి. అదే సమయంలో ఈ వివరాలను బ్యాంక్ కు కూడా తెలపండి. వీలైనంత త్వరగా బ్రాంచ్ మేనేజర్‌ని సంప్రదించండి. సందేహాలు లేదా ఫిర్యాదులతో BHIM టోల్-ఫ్రీ నంబర్ 18001201740ని సంప్రదించడం. బ్యాంకును సంప్రదించటం: డబ్బును మీరు తప్పుడు వ్యక్తి ఖాతాకు బదిలీ చేసి ఉంటే.. దాని వివరాలతో మీ బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. ఇది ఇంటర్ బ్యాంక్ లావాదేవీ అయితే.. అంటే, రెండు వేర్వేరు బ్యాంకుల మధ్య లావాదేవీ జరిగినట్లయితే.. సమీపంలోని బ్రాంచ్ ను రిసీవరీ కోసం సంప్రదిస్తుంది.

GPay PhonePe wrong account money sent what to do telugu
GPay PhonePe

7 రోజుల్లో డబ్బు వాపసు పొందవచ్చు: పొరపాటున డబ్బు పొందిన వ్యక్తి దానిని తిరిగి ఇచ్చేందుకు అంగీకరిస్తే.. 7 పని దినాల్లో డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి ఖాతాకు తిరిగి వస్తుంది. అతను డబ్బు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా లేకుంటే మరింత ఇబ్బంది ఉంటుంది. ఈ సందర్భంలో.. చట్టపరమైన మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. అయితే కస్టమర్ ఆమోదం లేకుండా.. ఏ బ్యాంకు అతని ఖాతా నుంచి డబ్బును బదిలీ చేయదు, అది నిజంగా పొరపాటున జరిగినప్పటికీ. కాబట్టి డిజిటల్ చెల్లింపులు చేసే సమయంలో ఒకటికి పదిసార్లు వివరాలు సరిచూసుకోవటం ఉత్తమం.

Share
Usha Rani

Recent Posts

Monica Siva : కార్తీ ఖైదీ మూవీలోని చిన్నారి ఎంత పెద్ద‌గా ఉంది.. ఆమె అందానికి ఫిదా కావ‌ల్సిందే..!

Monica Siva : ఇండియన్ సినిమాల్లో కొన్ని చిత్రాలు ప్రేక్ష‌కుల‌కి మంచి ఆస‌క్తిని క‌లిగిస్తాయి. ఆ సినిమాలు మంచి మ‌జాతో…

5 hours ago

OTT Suggestion : న‌రాలు తెగే ఉత్కంఠ‌.. ప‌ది నిమిషాల‌కొక ట్విస్ట్‌తో ఆస‌క్తి రేపుతున్న థ్రిల్ల‌ర్ మూవీ..

OTT Suggestion : ఇటీవ‌లి కాలంలో థ్రిల్ల‌ర్ మూవీస్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఎంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాయో మ‌నం చూస్తున్నాం.…

7 hours ago

CM YS Jagan : వైసీపీ మైండ్ గేమ్‌తో టీడీపీ కుదేలు.. కూట‌మికి చెక్ పెడ‌తారా..!

CM YS Jagan : ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయం చాలా రంజుగా సాగుతుంది. ఈ సారి ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారా…

13 hours ago

Aisha Sharma : అక్కా చెల్లెళ్లు ఇద్ద‌రూ అందాల‌ను చూపించ‌డంలో పోటీ ప‌డుతున్నారుగా..!

Aisha Sharma : చిరుత బ్యూటీ నేహా శ‌ర్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. రామ్ చ‌రణ్‌తో తెగ రొమాన్స్…

1 day ago

Nagababu : బ‌న్నీ ఆర్మీకి నాగ‌బాబుకి త‌లొగ్గక త‌ప్ప‌లేదా.. ట్విట్ట‌ర్ నుండి ఔట్..!

Nagababu : మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే" అంటూ కొణిదెల నాగబాబు…

1 day ago

Krishnamma OTT : రిలీజ్ అయిన వారం రోజుల‌కే ఓటీటీలోకి కృష్ణ‌మ్మ‌.. ఎక్క‌డ చూడొచ్చు అంటే..!

Krishnamma OTT : ఒక‌ప్పుడు థియేట‌ర్స్‌లో రిలీజైన సినిమా ఓటీటీలోకి రావ‌డానికి క‌నీసం 3 నెల‌లు అయిన సమ‌యం ప‌ట్టేది.…

2 days ago

Ashu Reddy : బ్లూ కలర్ లాంగ్ డ్రెస్‌లో మ‌త్తెక్కిస్తున్న జూనియ‌ర్ స‌మంత‌.. పోజులు మాములుగా లేవు..!

Ashu Reddy : జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి గురించి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ భామ…

2 days ago

Shiksha Das : ఐపీఎల్‌లో హీటు పెంచుతున్న బెంగాలీ బ్యూటీ.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ..?

Shiksha Das : ఐపీఎల్ టోర్నమెంట్ ప్ర‌తి ఒక్క‌రికి మంచి మ‌జాని అందిస్తుంటుంది. క్రికెట్ ప్రియులు, హీరోయిన్స్,ప‌లువురు స్టార్స్ కూడా…

2 days ago