Pawan Kalyan : పోతిన మ‌హేష్‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాములు కౌంట‌ర్ ఇవ్వ‌లేదుగా..!

Pawan Kalyan : ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. మూడు పార్టీల కూటమిలో భాగంగా సీట్ల దక్కని నేతలు ఎన్నికల సమయంలో వైసీపీ వైపు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో విజయవాడ నుంచి ర్యాలీగా పల్నాడులో జగన్ బస చేసిన సైట్ వద్దకు వచ్చిన పోతిన వైసీపీ కండువా కప్పుకున్నారు.జనసేనకు రాజీనామా చేసిన సమయంలో పోతిన మహేష్ జనసేనాని పవన్ కల్యాణ్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. పోతిన మహేష్ చేసిన విమర్శలపైన జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే, తాను మాట మీద నిలబడే నాయకుడి పార్టీలోకి వెళ్తానని పోతిన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.

అయితే తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. పోతిన మ‌హేష్‌పై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశారు. ఎదిరించే వాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమని అన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఐదుగురి చేతిలో రాష్ట్రం నలిగిపోతోందని తెలిపారు. అధికారం, పెత్తనం అంతా వారి చేతుల్లోనే ఉందని ధ్వజమెత్తారు. ఐదుగురు వ్యక్తులు ఐదు కోట్ల మంది ప్రజలను అణచివేస్తుంటే అందరూ కలిసి రావాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని భావించి పొత్తు పెట్టుకున్నామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ఏదైనా నిలదీస్తే నాపై, చంద్రబాబుపై, పురందేశ్వరిపై బూతులు తిడతారు అని మండిపడ్డారు. ఏ ఒక్కరినీ వదిలేది లేదని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని హెచ్చరించారు.

Pawan Kalyan strong counter to pothina mahesh
Pawan Kalyan

రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలి, పరిశ్రమలు ఏర్పాటై అభివృద్ధి దిశగా రాష్ట్రం పయనించాలి అని పెద్ద మనసుతో ఆలోచించి సీట్ల సర్దుబాటు విషయంలో బాగా తగ్గామని, ముఖ్యంగా, సంస్థాగతంగా బలంగా ఉన్న చంద్రబాబు కూడా టీడీపీ విషయంలో బాగా తగ్గారని పవన్ వివరించారు. నిడదవోలు నుంచి ఈసారి జనసేన పార్టీ బరిలో ఉందని, కందుల దుర్గేశ్ పోటీ చేస్తున్నారని వెల్లడించారు. కందుల దుర్గేశ్ గెలిచిన వెంటనే నిడదవోలు నియోజకవర్గ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. నిడదవోలు నియోజకవర్గ అభవృద్ధికి జనసేన వద్ద ప్రణాళికలు ఉన్నాయని అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Chandra Babu : చంద్ర‌బాబు ఆ ఒక్క‌దానిపైనే న‌మ్మకం పెట్టుకున్నారా.. అది నిల‌బెడుతుందా..?

Chandra Babu : ఏపీలో ఈ సారి రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది. వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుండ‌గా, టీడీపీ,…

10 hours ago

YSRCP Vs TDP : ఎల్లో టీమ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్.. విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేసిన వైసీపీ..

YSRCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన…

16 hours ago

Kirak RP : రోజాని ఓ రేంజ్‌లో చెడుగుడు ఆడిన కిరాక్ ఆర్పీ.. ఫస్ట్ ఓడిపోయేది మా యువరాణే..!

Kirak RP : ఏపీ ఎన్నిక‌లు సమీపిస్తున్న స‌మ‌యంలో ప్ర‌చారాలు కూడా ఊపందుకుంటున్నాయి. ప‌లు ప్రాంతాల‌లో సంచరిస్తూ జోరుగా ప్ర‌చారాలు…

21 hours ago

Allu Arjun BMW Car : అల్లు అర్జున్ కొత్త బీఎండ‌బ్ల్యూ కారు ధ‌ర తెలిస్తే వ‌ణుకు పుడ‌త‌ది..!

Allu Arjun BMW Car : గంగోత్రితో తొలిసారిగా ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించి ఆర్య‌లో కాలేజ్ కుర్రాడిలా అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొట్టిన…

1 day ago

CM YS Jagan : ఏంటి.. జ‌గ‌న్‌కి ఫోన్ లేదా.. ప్ర‌త్యేక నెంబ‌ర్ కూడా లేదా..?

CM YS Jagan : ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో చాలా బిజీగా ఉన్నారు. అనేక…

1 day ago

CM YS Jagan : సీఎంగా అక్క‌డే ప్ర‌మాణం చేస్తానంటూ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

CM YS Jagan : ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. ఈ సారి ఎవరు అధికారంలోకి…

2 days ago

SRH : స‌న్‌రైజ‌ర్స్‌నా, మ‌జాకానా.. వారి దెబ్బ‌కు రికార్డ్‌లన్నీ కూడా చెల్లాచెదురు అయిపోతున్నాయిగా..!

SRH : స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఈ మధ్య కాలంలో అద్భుతంగా ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ్చిన దాఖ‌లాలే లేవు. కొన్ని…

2 days ago

RCB In Play Offs : ఆర్సీబీ ప్లే ఆఫ్‌కి వెళ్లే ఛాన్స్ ఉందా.. వెళ్లాలి అంటే ఇవి జరిగి తీరాలి..!

RCB In Play Offs : గ‌త 16 సీజ‌న్స్‌గా ఐపీఎల్ ఆడుతున్న ఆర్సీబీ ఒక్క‌సారి కూడా క‌ప్ కొట్టింది…

2 days ago