Chandra Babu : ప‌వ‌న్ వారాహి మీద నిలుచొని చంద్ర‌బాబు అదిరిపోయే స్పీచ్.. జ‌న‌సేనాని న‌వ్వాపుకోలేక‌పోయాడు..

Chandra Babu : ఏపీలో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. మూడు పార్టీల తరపున సింహ గర్జన మొదలైంది. ప‌వన్, చంద్ర‌బాబు ప‌దునైన స్పీచ్‌తో అద‌ర‌గొడుతున్నారు. ప్రజాగళం వినిపిస్తాం. నిడదవోలు జన వారాహిని చూస్తే జగన్ రెడ్డికి నిద్రపట్టక గుండె పగిలిపోవడం ఖాయం. జగన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి నిడదవోలు ప్రజలు సిద్దంగా ఉన్నారు. కూటమిని అడ్డుకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే తొక్కుకుంటూ పోతాం’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ కు చెందిన వారాహి వాహనం పైనుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “గత 40 ఏళ్లలో నిడదవోలుకు అనేక పర్యాయాలు వచ్చాను. ఇక్కడికి వచ్చిన ప్రజల ఉత్సాహం చూస్తుంటే మే 13న గెలవబోయేది ఎన్డీయే అని స్పష్టమవుతోంది.

మొట్ట మొదటిసారిగా మూడు పార్టీల అధ్యక్షులం ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఇక్కడికి వచ్చాం. వారాహి నుంచి ప్రజాగళం వినిపిస్తున్నాం. మిత్రుడు పవన్ కల్యాణ్ వారాహి గురించి చెబుతుంటే విన్నాను కానీ, ఇవాళే చూస్తున్నాను. ఇక్కడ్నించి మూడు పార్టీల తరఫున సింహ గర్జన చేస్తున్నాం. ప్రజాగళాన్ని వినిపిస్తున్నాం. ఇప్పుడే తణుకులో నేను, పవన్ కల్యాణ్ గారు రోడ్ షో చేశాం… అదిరిపోయింది. ఇప్పుడు నిడదవోలు దద్దరిల్లిపోయింది. ఇది చూస్తే జగన్ కు నిద్ర రాదు… గుండె పగలిపోవడం ఖాయం. సినిమాల్లో పవర్ స్టార్ గా ఉన్న వ్యక్తి పవన్ కల్యాణ్… నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు, భారత్ ను ప్రపంచపటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న మోదీ ఉన్నారు… నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు చెప్పండి… మనకు జగన్ ఓ లెక్కా?

Chandra Babu sensational comments on cm ys jagan on varahi
Chandra Babu

జగన్ మోహన్ రెడ్డి ఎక్కడో సిద్ధం సిద్ధం అని తిరుగుతున్నాడు… నిడదవోలు నుంచి చెబుతున్నాం… నిన్ను ఓడించడానికి మేం సిద్ధం. మమ్మల్ని అడ్డుకోవాలంటే నీ వల్ల కాదు… సైకిల్ స్పీడు పెంచి తొక్కుకుంటూ ముందుకెళతాం. పగలగొట్టాలని చూస్తే గాజు గ్లాసు మరింత పదునెక్కుతుంది… నీ గుండెల్లో గుచ్చుకుంటుంది. బురద వెయ్యాలని చూస్తే కమలం వికసిస్తుందే తప్ప, నీ బురద అంటదు. ఈ మూడు కలిసిన తర్వాత ఇక అన్ స్టాపబుల్. మేం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఈ ఆటుపోట్లు మాకు కొత్త కాదు… మేం రాటుదేలిపోయాం. కానీ పవన్ కు ఇలాంటి పరిస్థితులు అలవాటు లేకపోయినా నిలదొక్కుకున్నారు. మావి మూడు జెండాలు… కానీ అజెండా ఒక్కటే. సీట్ల సర్దుబాటుతో అనేక త్యాగాలు చేసి మీ వద్దకు వచ్చాం. నిండు మనసుతో ఆశీర్వదించండి అని అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Shiksha Das : ఐపీఎల్‌లో హీటు పెంచుతున్న బెంగాలీ బ్యూటీ.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ..?

Shiksha Das : ఐపీఎల్ టోర్నమెంట్ ప్ర‌తి ఒక్క‌రికి మంచి మ‌జాని అందిస్తుంటుంది. క్రికెట్ ప్రియులు, హీరోయిన్స్,ప‌లువురు స్టార్స్ కూడా…

3 hours ago

Vijay Sethupathi Son : అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న విజ‌య్ సేతుప‌తి కొడుకు.. ఆయ‌న‌కి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..!

Vijay Sethupathi Son : విలన్‌, హీరో, క్యారెక్టర్‌ ఏ పాత్ర ఇచ్చినా.. తనని తాను మార్చుకుని అందుకు తగ్గట్టుగా…

5 hours ago

Guess The Person : అబ్ధుల్ క‌లాంతో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఎవ‌రో తెలుసా?

Guess The Person : సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల సెల‌బ్రిటీల‌కి సంబంధించిన చిన్న‌నాటి పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి.…

8 hours ago

Nagababu : నాగ‌బాబు టార్గెట్ ఎవ‌రు.. అల్లు వారబ్బాయిని ఉద్దేశించే అలాంటి ట్వీట్ చేశాడా..!

Nagababu : ఏపీ ఎన్నిక‌లు ఈ సారి మంచి రంజుగా సాగాయి. ప్ర‌చారంలో చాలా మంది ఒక‌రిపై ఒక‌రు తీవ్ర…

11 hours ago

Business Idea : ఇంట్లో కూర్చునే ఈ బిజినెస్ చేయ‌వ‌చ్చు.. నెల‌కు ల‌క్ష‌ల్లో సంపాదిస్తారు..!

Business Idea : ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంటి ద‌గ్గ‌ర ఉండి ప్ర‌తి ఒక్క‌రు…

1 day ago

How To Book Tatkal Tickets : ఈ ట్రిక్స్ పాటిస్తే చాలు.. త‌త్కాల్ టికెట్‌లో బెర్త్ క‌న్‌ఫామ్ అవుతుంది..!

How To Book Tatkal Tickets : రైల్వేలో నిత్యం వేల‌కొల‌ది మంది ప్ర‌యాణించ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే…

1 day ago

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

Torn Currency Notes : చాలా మంది ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన కరెన్సీ నోట్లు ఉంటాయి. అవి…

1 day ago

OTT Horror Web Series : హార‌ర్ వెబ్‌సిరీస్‌ని తెలుగులోకి తీసుకొస్తున్న బాహుబ‌లి నిర్మాత‌లు.. స్ట్రీమింగ్ ఎందులో కానుంది అంటే..!

OTT Horror Web Series : ఇటీవ‌లి కాలంలో వెబ్ సిరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద నిర్మాత‌లు…

2 days ago