Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Mohammad Siraj : సిరాజ్ గొప్ప మ‌న‌సు.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అమౌంట్ వారికి ఇచ్చాడు..!

Shreyan Ch by Shreyan Ch
September 18, 2023
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Mohammad Siraj : ఒక్క మ్యాచ్‌తో సిరాజ్ ఎవ‌రికి అంద‌నంత ఎత్తులో నిలిచాడు.ఆసియా క‌ప్ ఫైన‌ల్‌లో అద్భుతంగా బౌల్ చేసి ఆరు వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీంతో శ్రీలంక 50 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన కార‌ణంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకున్నాడు సిరాజ్. అయితే తనకు లభించిన క్యాష్ ప్రైజ్‌ను కొలంబో గ్రౌండ్స్‌మన్‌కు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సంచలన బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన సిరాజ్(6/21) భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

సిరాజ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గా వ‌చ్చిన క్యాష్ ప్రైజ్ 50 వేల యూఎస్ డాలర్లను గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. మైదాన సిబ్బంది కష్టం వల్లే ఈ టోర్నీ సాధ్యమైందని వారిని కొనియాడాడు..మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకునే సమయంలో సిరాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ ప్రదర్శన ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇష్టమైన బిర్యానీ తిందామంటే ఇక్కడ లేదు. చాలా రోజులుగా నేను మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాను. గతంలో ఈ రోజు వచ్చిన ఎడ్జెస్ రాలేదు. పిచ్ ఆరంభంలో పేస్‌తో పాటు స్వింగ్‌కు అనుకూలించింది. స్వింగ్ అవుతుండటంతో ఫుల్లర్ లెంగ్త్ బాల్స్ వేయాలనుకున్నా.

Mohammad Siraj big heart donated his man of the match amount
Mohammad Siraj

మా ఫాస్ట్ బౌలర్ల మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇది జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. బౌండరీ ఆపాలని పరుగెత్తా. అది ఆపి ఉంటే మరింత సంతోషపడేవాడిని. ఇది నా బెస్ట్ స్పెల్. ఈ క్యాష్ ప్రైజ్‌ను గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చేస్తున్నా. వారు వల్లే ఈ టోర్నీ సాధ్యమైంది.’అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఫైన‌ల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. మహమ్మద్ సిరాజ్(6/21) సంచలన బౌలింగ్‌తో 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా(3/3), జస్‌ప్రీత్ బుమ్రా(1/23) సత్తా చాటారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. స్వల్ప లక్ష్యం కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మకు బదులు.. ఇషాన్ కిషన్(18 బంతుల్లో 3 ఫోర్లతో 23 నాటౌట్) ఓపెనింగ్ చేశాడు. శుభ్‌మన్ గిల్‌(19 బంతుల్లో 6 ఫోర్లతో 27 నాటౌట్)తో కలిసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Tags: Mohammad Siraj
Previous Post

KA Paul : జూనియర్ ఎన్టీఆర్‌ని చూసి నేర్చుకో ప‌వ‌న్.. కేఏ పాల్ కామెంట్స్..

Next Post

7G Brundavan Colony : 7జి బృందావ‌న కాల‌నీ యాక్ట‌ర్ల‌ను ఇప్పుడు చూడండి.. ఎలా మారిపోయారో..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

బిజినెస్

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

by Shreyan Ch
May 16, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

మొన్న ట్విట్ట‌ర్‌.. ఇప్పుడు ఫేస్‌బుక్‌.. భారీగా ఉద్యోగాల‌కు కోత‌.. ఏం జ‌రుగుతోంది..?

by Mounika Yandrapu
November 8, 2022

...

Read moreDetails
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

న‌య‌న‌తార ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టడం ఖాయం..!

by Shreyan Ch
September 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.