Vidadala Rajini : ఇప్పుడు ఏపీ ఎన్నికలు రంజుగా మారనున్నట్టు అర్ధమవుతుంది. అధికార ప్రభుత్వం వైసీపీపై ప్రతిపక్ష నేతలు టీడీపీతో పాటు ఇతర పార్టీ నాయకులు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో టీడీపై వర్సెస్ వైసీపీ మధ్య యుద్ధం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ క్రమంలో అనేక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.కొద్ది నెలల క్రితం అసెంబ్లీ సమావేశాలు గందరగోళంగా మారాయి. టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్టుపై చర్చించాలని డిమాండ్ చేస్తు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. సభలో మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా అదే పరిస్థితులు రిపీట్ అయ్యాయి.
ఈక్రమంలో టీడీపీ నేత, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సభలో ఈల వేశారు. ఈల వేస్తు తన నిరసనను తెలిపారు. విజిల్ తెచ్చుకుని ఉన్న చోటే నిలబడి కంటిన్యూగా విజిల్ వేశారు. ఒకసారి బాలకృష్ణ మీసం తిప్పారని, మరోసారి విజిల్ వేసారని..ఈ క్రమంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది టీడీపీ ఆఫీసుకు కాదు..గౌరవమైన సభ..ఇక్కడ ఈలలు వేయటం సరికాదు అంటూ మండిపడ్డారు. ఇలా అసెంబ్లీలో అంబటి వర్సెస్ బాలకృష్ణగా మారింది. మరోవైపు విడదల రజనీని తనను చూసి విజిల్ వేసాడని, ఇది సినిమా కాదు అంటూ మండిపడ్డట్టు కూడా ప్రచారం సాగింది.
![Vidadala Rajini : విడదల రజనీని చూసి విజిల్ వేసిన బాలయ్య.. ఒక్కసారిగా అందరు షాక్ Vidadala Rajini angry comments on balakrishna](http://3.0.182.119/wp-content/uploads/2024/02/vidadala-rajini.jpg)
చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని స్కామ్ అనేదే లేదని..అవినీతి జరగిందనే ఆరోపణలతో అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టారని టీడీపీ ఆ సమయంలో చాలా విమర్శలు చేసింది. అవినీతి జరిగిందనే ఆరోపణలే తప్ప దానికి సంబంధించి సీఐడీ ఆధారాలు చూపించలేని దుస్థితిలో ఉందని.. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయటం దుర్మార్గమని అది సీఎం జగన్ కక్ష సాధింపు చర్య అంటూ వారు దుమ్మెత్తిపోసారు. ఈ క్రమంలో బాలయ్యతో పాటు మరి కొందరు వివిధ రకాలుగా తమ నిరసన తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.